News
ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్…

హైదరాబాద్ , డిసెంబర్ 02 , VSB NEWS :
రాయదుర్గంలో ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
బెంగళూరు తర్వాత రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇంటెల్.
దాదాపు 1500 మంది ఉద్యోగులు కూర్చొని పని చేసే సామర్థ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజాతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ అభివృద్ధికి జయేష్ రంజన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది.
ఎలక్ర్టానిక్స్ మానిఫ్యాక్చరింగ్ రంగంలో వచ్చే నాలుగేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఏప్రిల్‌లో టీ వర్క్స్ ఆవిష్కరిస్తాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
News
ప్రచారంలో కేవలం సీఎం జగన్ ఫొటోను మాత్రమే వినియోగించాలని

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, డిసెంబర్ 09 , VSB NEWS :
ప్రభుత్వ పథకాల ప్రచారంలో కేవలం సీఎం జగన్ ఫొటోను మాత్రమే వినియోగించాలని… అన్ని జిల్లాలు, శాఖల అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
ఇదే అంశంపై 2003, 2004 , 2012 సంవత్సరాల్లో సుప్రీంకోర్టు అదేశాలు ఉన్నాయని… ఈ ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని సీఎంఓ ఆదేశించింది.
ఫ్లెక్సీలు, కరపత్రాలు , గోడపత్రాలపై అధికారుల ఫొటోలు సైతం ముద్రిస్తున్నట్లు సీఎంఓ దృష్టికి వచ్చింది.
ఈ నేపథ్యంలో కేవలం ముఖ్యమంత్రి ఫొటోనే వాడాలని నిర్దేశించింది .
కేవలం టీవీలు, పత్రికా ప్రకటనల్లోనే కాకుండా… సామాజిక మాధ్యమాలు సహా అన్ని రకాల ప్రచారంలోనూ ముఖ్యమంత్రి ఒక్కరి ఫొటోనే వినియోగించాలని స్పష్టంచేసింది.
News
సీఎం జగన్ నివాసాల్లో నిధుల కేటాయింపు జీవోలను రద్దు

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, డిసెంబర్ 09 , VSB NEWS :
గుంటూరు జిల్లా తాడేపల్లి, హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని సీఎం జగన్ నివాసాల్లో విద్యుత్ పనులకు నిధులు కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది.
ఈ మేరకు గతంలో జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యుత్ పనుల కోసం 3.63 కోట్లు మంజూరు చేస్తూ జులై 12న ఆదేశాలు వెలువడ్డాయి.
అలాగే హైదరాబాద్ నివాసంలో విద్యుత్ పనులకు 35.5లక్షలు నిధులు ఖర్చు చేయడానికి అనుమతిస్తూ నవంబర్ 25న ఆదేశాలు ఇచ్చారు.
ఆ రెండు జీవోలను రద్దు చేస్తూ రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశాలు వెలువరించారు.
సీఎం నివాసానికి పెద్దఎత్తున నిధుల కేటాయిస్తున్నారంటూ రాజకీయ విమర్శలు వస్తుండటంతో… నిధుల కేటాయింపు జీవోలను రద్దు చేసినట్లు తెలిసింది
News
13న విశాఖలో సీఎం జగన్ పర్యటన…

ఆంధ్రప్రదేశ్ , విశాఖపట్నం, డిసెంబర్ 09 , VSB NEWS :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న విశాఖలో పర్యటించనున్నారు.
రూ.1300 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
వివిధ విభాగాలకు చెందిన 24 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
అమృత్ పథకం కింద 40వేల హౌస్ సర్వీస్ కనెక్షన్లను సీఎం చేతుల మీదగా అందజేస్తారని జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు.
ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన ఆర్కే బీచ్‌ను మెరుగుపరిచే పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు.
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సాయంతో చేపట్టిన ముడసర్లోవ రిజర్వాయర్‌లో శాశ్వత ప్రాతిపదికన పూడికతీత తీసే ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.
-
FAST NEWS7 hours ago
ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(09-12-2019)
-
FAST NEWS2 days ago
ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(07-12-2019)
-
FAST NEWS1 day ago
ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(08-12-2019)
-
News2 days ago
2020 కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.