Connect with us

Entertainment

90 ఎం ఎల్ చిత్ర యూనిట్ సందడి…

Published

on

విజయవాడ నగరంలో
90 ఎం ఎల్ చిత్ర యూనిట్ సందడి చేసింది.కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో ఆర్ ఎక్స్ 100 మూవీ ఫేమ్ హీరో కార్తికేయ నటించిన
90 ఎం ఎల్ చిత్రం డిసెంబర్ 5 న రిలీజ్ కానున్న సందర్భంగా
చిత్రం ప్రమోషన్ లో భాగంగా బెంజ్ సర్కిల్ లోని హోటల్ మార్గ్ కృష్ణయ్య లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న చిత్ర హీరో కార్తికేయ, హీరోయిన్ నేహా సోలంకి పాల్గొని చిత్ర విశేషాలను మీడియాకు వివరించారు. ఈసందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ
డిసెంబర్ 5 వ తేదీన
చిత్రం రిలీజ్ కానుందని అన్నారు.విజయవాడ నుంచి చిత్ర ప్రమోషన్ ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ చిత్రం పక్కా లవ్, ఎంటర్టైన్మెంట్ అని తెలిపారు.
సాంగ్స్,ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని,ప్రమోషన్స్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి కాన్ఫిడెన్స్ వచ్చిందన్నారు.ఈచిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని గత చిత్రాల కంటే భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.దర్శకుడు శేఖర్ రెడ్డి తనను ఈచిత్రంలో కొత్తగా చూపించారని అన్నారు.ప్రేమ కథకు సంబంధించిన ప్రతి సన్నివేశాలను ఎంతో అందంగా తీశారని తెలిపారు. చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ ఎంతో కొత్తగా ఉంటుందని,ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బాగుందని ప్రతి పాట ప్రేక్షకుల మదిని దోచే విధంగాఉన్నాయనిపేర్కొన్నారు
ఈచిత్రం ఎంతో రిచ్ గా తీశారని తాను నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ సినిమా అని వివరించారు.
ఇప్పటివరకు తెలుగుతెరపై చూడని భిన్నమైన చిత్రమని తెలియజేసారు.
ఈ చిత్రంలో హీరోయిన్ పేరు సువాసన తన క్యారెక్టర్ కూడా డిఫరెంట్ అని అన్నారు.
ఆల్కహాలిక్ అలవాటు ఉన్న హీరోని ,హీరోయిన్ ఎలా ప్రేమించింది అనేదే చిత్ర కధాంశమని అన్నారు.
రవికిషన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారని చెప్పారు.తదనంతరం
హీరోయిన్ నేహా సోలంకి మాట్లాడుతూ
90ఎం ఎల్ చిత్రంతో తాను తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెడుతున్నానని
ఈ చిత్రంతో తనకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేసారు.
ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నట్లు చెప్పారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

అరణ్య  టీజర్‌  విడుదల

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , ఫిబ్రవరి 13 , VSB NEWS :

హీరో దగ్గుబాటి రానా హిందీలో నటిస్తున్న చిత్రం ‘హాథీ మేరే సాథీ’. ఈ చిత్రాన్ని హిందీతో పాటు కన్నడలో ‘కాదన్’, తెలుగులో ‘అరణ్య’గా విడుదల చేస్తున్నారు. అడవి నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి.. ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్నదే ఈ చిత్ర కథంశం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా హిందీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో రానా నటన అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో రానా సరసన జోయా హుస్సేన్, శ్రియ నటిస్తున్నారు. విష్ణు విశాల్, సామ్రాట్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కేరళ అడువుల్లో జరుగుతోంది. ఈ మూవీని దర్శకుడు ప్రభు సోలోమన్ తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Continue Reading

Entertainment

ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న జూనియర్ ఎన్టీఆర్

Published

on

 

ఆంధ్రప్రదేశ్ , జనవరి 29 , VSB NEWS :

మరో ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న జూనియర్ ఎన్టీఆర్

రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
ఇటీవలే యూనిట్ తో జాయిన్ అయిన అజయ్ దేవగణ్
అజయ్ దేవగణ్ కు స్వాగతం పలికిన ఎన్టీఆర్
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా ఆర్ఆర్ఆర్ సెట్స్ పై అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ ఆసక్తికరమైన ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అజయ్ దేవగణ్ కు స్వాగతం పలుకుతున్నట్టు పేర్కొన్నారు. “మా ఆర్ఆర్ఆర్ లోకంలోకి అజయ్ దేవగణ్ సార్ కు స్వాగతం పలకడం సంతోషంగా ఉంది” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లోని ఫొటోలో ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ లతో పాటు దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్ కూడా ఉన్నారు.

Continue Reading

Entertainment

లవ్ స్టోరీ రాశాను,కొత్త హీరోను పరిచయం చేస్తాను…

Published

on

ఆంధ్రప్రదేశ్ , జనవరి 29, VSB NEWS :

లవ్ స్టోరీ రాశాను .. కొత్త హీరోను పరిచయం చేస్తాను: హీరో నాగశౌర్య

నాగశౌర్య నుంచి ‘అశ్వద్ధామ’
యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యత
ఈ నెల 31వ తేదీన విడుదల
నాగశౌర్య కథానాయకుడిగా రమణతేజ దర్శకత్వంలో ‘అశ్వద్ధామ’ సినిమా రూపొందింది. తను స్వయంగా రాసిన కథను .. సొంత బ్యానర్లో నాగశౌర్య నిర్మించాడు. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో నాగశౌర్య మాట్లాడుతూ .. “ఈ కథలో ప్రతి పాత్రకి ప్రత్యేకత .. ప్రాధాన్యత .. ప్రయోజనం ఉంటాయి. నా పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుంది. నాగశౌర్య ఎలాంటి పాత్రలైనా చేస్తాడు అనే నమ్మకం ఈ సినిమాతో ఆడియన్స్ కి కలుగుతుందని చెప్పగలను. నేను రాసిన కథ అన్ని తరగతుల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుంది. మంచి ఫీల్ తో కూడిన ఒక ప్రేమకథను కూడా రాశాను. అయితే ఈ ప్రేమకథలో నేను నటించను. ఈ కథ ద్వారా మా బ్యానర్ పైనే ఓ కొత్త హీరోను పరిచయం చేస్తాను” అని చెప్పుకొచ్చాడు.

Continue Reading

Trending

www.vsbnews.in