Connect with us

FAST NEWS

చదువులతల్లి నాగులాపల్లి… మళ్ళీ మెరిసింది…

Published

on

తూర్పుగోదావరి జిల్లా, u కొత్తపల్లి మండలం, నాగులాపల్లి :

ఈ రోజు విడుదలైన గ్రామ సచివాలయం ఫలితాలలో డిజిటల్ అసిస్టెంట్ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ ర్యాంక్ సాధించిన నాగులాపల్లి విద్యార్థిని….

వివరాల్లోకి వెళ్తే… తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం, నాగులాపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి రమ్య లాలిస ఈ రోజు విడుదల చేసిన గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ కేటగిరిలో మహిళల విభాగంలో 106.25 మార్క్స్ తో రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలవడం… వల్ల తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలకు… ఆనందానికి అవధులు లేకుండా పోయింది…

లాలిస నాన్నగారు సైకిల్ రిపేర్ కార్మికుడు… మాటల్లో… నా కుమార్తె రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలవడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని, చిన్నప్పటి నుండి ఏదైనా సాధించాలి అన్న తపనతోనే తన చదువు సాగించేది అని, తాను ఇంకా మంచిస్తాయికి వెళ్లి తమకి, గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని తన పుత్రికోత్సాన్ని వ్యక్తపరిచారు…

Continue Reading
Advertisement
2 Comments

2 Comments

 1. G ssp Reddy (police)

  September 19, 2019 at 2:56 pm

  Congrats Amma,God blessyou

  • SURESH

   September 19, 2019 at 2:59 pm

   thanks for ur blessings sir…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(19-03-2020)

Published

on

By

క‌రోనా కాటుకు గ్యాంబ్ల‌ర్లు కూడా బిక్కుబిక్కుమంటున్నారు.అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఉన్న కాసినోల‌ను మూసివేశారు. నెల రోజుల పాటు క్యాసినోల‌ను మూసివేయాల‌ని అమెరికా ప్ర‌భుత్వం ఆదేశించింది. ప్ర‌తి రోజు వేలాది మంది జూద‌గాళ్లు లాస్ వెగాస్‌లో గ్యాంబ్లింగ్ ఆడేందుకు వ‌స్తుంటారు. అయితే క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. క్యాసినోలు, రెస్టారెంట్లు, ఇత‌ర బిజినెస్ కేంద్రాల‌ను మూసివేస్తున్న‌ట్లు నెవ‌డా రాష్ట్రం ప్ర‌క‌టించింది.తాజా ప్ర‌భుత్వ ఆదేశాల‌తో గ్యాంబ్లింగ్ రాజ‌ధానిగా పేరుగాంచిన లాస్ వెగాస్ వెల‌వెల‌బోయింది.సాధార‌ణంగా లాస్ వెగాస్‌లో 24 గంట‌లూ క్యాసినోలు తెరిచి ఉంటాయి.1963లో జాన్ ఎఫ్ కెన్న‌డీ అంత్య‌క్రియ‌లు రోజున మాత్ర‌మే క్యాసినోల‌ను మూసివేశారు.మ‌ళ్లీ ఇప్పుడు క‌రోనా భ‌యంతో వాటిని లాక్‌డౌన్ చేశారు.

వచ్చే త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లలో కోత విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో ద్రవ్య పరపతి విధాన వడ్డీరేట్ల కోత బదిలీ త్వరగా జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్‌ వడ్డీ రేట్లు హేతుబద్ధీకరించినప్పటికీ ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న మొత్తాల వడ్డీరేట్ల జోలికి పోలేదు.

టెలికాం సంస్థలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సవరించిన స్థూల ఆదాయం(ఏజీర్‌) ఛార్జీల చెల్లింపు విషయంలో ఎలాంటి పునఃసమీక్ష ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై కోర్టు మొట్టికాయలు వేసింది.‘‘అసలు ఎవరు సమీక్షించమన్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. బకాయిలు వసూలు చేయడంలో ప్రభుత్వ తీరుపై కూడా కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఛార్జీల పునఃసమీక్షకు గడువు ఇవ్వాలన్న కేంద్రం వాదనను తోసిపుచ్చింది. కోర్టును ప్రభావితం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారని.. కానీ, అది సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసం బుధవారం ఈ అంశంపై విచారణ జరిపింది. ఒకవేళ పునఃసమీక్షని అంగీకరిస్తే కోర్టు గతంలో తప్పుచేసినట్లవుతుందని.. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపుల పునఃసమీక్షకు అనుమతించిన అధికారుల్ని సహించేది లేదని హెచ్చరించింది.

అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ (కొవిడ్‌-18) వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో.. చైనాలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ రిటైల్‌ దుకాణాలను నిరవధికంగా మూసివేస్తున్నట్టు టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రకటించింది. తొలుత మార్చి 27 వరకే తమ రిటైల్‌ స్టోర్లను మూసివేయనున్నామని ప్రకటించిన ఆ సంస్థ.. తాము తిరిగి ప్రకటించేంత వరకూ స్టోర్ల మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల దిశగా కొనసాగుతున్నాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలో ఊగిసలాట ధోరణిలో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి దిగజారిపోయాయి. ఉదయం 11.46 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 789 పాయింట్లు నష్టపోయి.. 29,776 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయి 8,732 వద్ద ట్రేడవుతోంది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.12 వద్ద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వైరస్‌ ప్రభావంతో మదుపరులు భయాలకు లోనవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం యెస్‌ బ్యాంక్‌ పద్దులన్నీ సరిగ్గానే ఉన్నందున ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాల్సిన అవసరం లేదని యెస్‌ బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టరుగా (ఎండీ) నియమితులైన ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. నిధుల లభ్యత విషయంలోనూ ఆందోళన చెందనక్కర్లేదని అన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి బ్యాంకు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరుగుతాయని అన్నారు. యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా ప్రశాంత్‌ కుమార్‌ 26న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌, ఫెడ్‌రల్‌ బ్యాంక్‌ సీఎఫ్‌ఓ అశుతోష్‌ ఖజూరియాతో కలిసి మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘మేం తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని ఏటీఎంల్లో డబ్బులు ఉన్నాయి. శాఖల్లోనూ నిధుల కొరత లేదు. మొత్తానికి యెస్‌ బ్యాంక్‌కు సంబంధించి ఎలాంటి నిధుల సమస్య లేద’ని ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. నిధుల కోసం ఇతర బయటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. మారటోరియం తొలగిపోయాక.. పూర్తి స్థాయిలో బ్యాంకింగ్‌ సేవల అనుభూతిని వినియోగదారులు పొందొచ్చని తెలిపారు. డిపాజిట్ల భద్రతపై డిపాజిటుదార్లు ఆందోళన చెందనక్కర్లేదని కూడా ఆయన భరోసా కల్పించారు. అయితే సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లపై ప్రస్తుతం చెల్లిస్తున్న అత్యధిక 5-6% వడ్డీని కొనసాగించడంపై ఆయన హామీ ఇవ్వలేనన్నారు. మారటోరియం ఆంక్షలు తొలగింపుతో బ్యాంకు శాఖలకు ఖాతాదారులు డిపాజిట్లను వెనక్కి తీసుకునే నిమిత్తం పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది.

ఇప్పటి వరకు తెలంగాణ గడ్డపై ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, కేవలం ఇతర దేశాల నుంచి వచ్చివ వారికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించి ఎక్కడా రాజీపడకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు ఏవైనా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్లు మంత్రి ఈటల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు సెలవులు ప్రకటించింది ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటారని తప్ప ప్రయాణాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు కాదని ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైరస్‌ బారిన పడకుండా పిల్లలను చూసుకునే బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదేనన్నారు.

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం జరిగిన ఘటనల్లో నమోదైన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆ సమయంలో ముఖ్యంగా రిలయన్స్‌ దుకాణాలపై దాడులకు సంబంధించి నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును సైతం వైకాపా నేతలు వక్రీకరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో కరోనా విస్తరణ వల్లే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను వాయిదా వేసిందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కరోనా వైరస్‌పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వైరస్‌ నియంత్రణపై వైకాపా ప్రభుత్వానికి అసలు బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.

మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ నిల్వల వివరాలు సమర్పించని సంస్థలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయా వస్తువుల ఉత్పత్తిదారులు, దిగుమతిదారులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అందుకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందరికీ అందుబాటులోకి ఉండేందుకు, వాటి ధరలు, అమ్మకాలలో అక్రమాలను నివారించేందుకు ఈ వస్తువులను నిత్యావసరాలుగా ప్రకటించింది.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో విధించిన ఎన్నికల కోడ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సడలించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడ్‌ సడలింపునకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో బుధవారం జరిగిన విచారణకు సంబంధించిన తీర్పు కాపీ విడుదలైంది. తీర్పు కాపీలో విచారణలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను పేర్కొంది. స్థానిక ఎన్నికల వాయిదాపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేశంలో ఎక్కడచూసినా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు విస్తరించిన కరోనా వైరస్‌తో ప్రజలు తమ దూర ప్రయాణాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. విదేశీ ప్రయాణం చేసివచ్చిన వారిని కొన్నిరోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంత అప్రమత్తంగా ఉన్న సమయంలో ‘హోం క్వారంటైన్‌’ కావాల్సిన కొందరు వ్యక్తులు రైల్లో ప్రయాణం చేయడం కలకలంరేపింది. ఇది గమనించిన సిబ్బంది వారిని అక్కడే రైలు నుంచి దించేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.

ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. వైరస్‌ బాధితులకు చికిత్సలు చేసిన వైద్యులను సైతం కరోనా విడిచిపెట్టడం లేదు. వైరస్‌ బాధితులతో పాటు వైద్యులు కూడా స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. అయినా, వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈమేరకు ఓ వైద్యుడి భార్య ఈ వైరస్‌ తమ జీవితాలను మార్చేసిన విధానాన్ని ట్విటర్లో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్లు నెటిజన్లను కదిలిస్తున్నాయి. అమెరికాకు చెందిన రాచెల్‌ పాట్జెర్‌ భర్త ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఆమె రెండు వారాల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ఆ బిడ్డను తన భర్త కనీసం తాకనైనా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

వచ్చే త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లలో కోత విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో ద్రవ్య పరపతి విధాన వడ్డీరేట్ల కోత బదిలీ త్వరగా జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్‌ వడ్డీ రేట్లు హేతుబద్ధీకరించినప్పటికీ ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న మొత్తాల వడ్డీరేట్ల జోలికి పోలేదు.

రెండు ప్రపంచకప్‌లు గెలిచిన తన సారథ్యంలో 2008లోని ‘మంకీ గేట్‌’ వ్యవహారమే అత్యంత ఘోరమైందని ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. అది చోటు చేసుకున్నప్పుడు పరిస్థితులు తన నియంత్రణలో లేకుండా పోయాయని వెల్లడించాడు. సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌పై టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా అక్కడి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు విద్యాసంస్థలు మూతపడగా తాజాగా ఐఐటీ బాంబేను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. మార్చి 31 వరకు క్యాంపస్‌ను మూసివేస్తున్నామని, విద్యార్థులు కూడా రెండురోజుల్లో హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశించింది. క్యాంపస్‌లోకి ఏ ఒక్కరినీ అనుమతించబోమని, కొందరు విదేశీ విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.

కాలేజీ యాజమాన్యాలు అండదండలతో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నారనే కచ్చితమైన సమాచారంతో టోలిచౌకి లోని న్యూ మదీనా జూనియర్ కాలేజీ పై టాస్క్ఫోర్స్ పోలీసులు మరియు డిస్టిక్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లో కలిసి దాడి చేసి ఎనిమిది మంది మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్కొక్క విద్యార్ధి వద్దనుండి ఐదు నుంచి ఎనిమిది వేల వరకు డబ్బును ఒక్క పేపర్ కోసం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు, పరీక్ష రాసే సమయంలో అందరిలాగానే వారికి కూడా సమాధాన పత్రాన్ని ఇచ్చి ఎగ్జామ్ లో కూర్చో పెడుతున్నారు. ఇదిలా ఉండగా డబ్బులు ఇచ్చిన విద్యార్థుల ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లను కళాశాల ఉపాధ్యాయులతో రాయించిన పిమ్మట చివరికి విద్యార్థుల చేతికి అందిస్తున్నట్టు ఎడ్యుకేషన్ ఆఫీసర్ తెలిపారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో గల రామానంద నగర్ దొంగతనం అధికారి రాజశేఖర్ ఇంట్లో గత రాత్రి దొంగలు పడ్డారు మూడున్నర తులాల బంగారం 62 తులాల వెండి ఆభరణాలతో పాటు 75 వేల రూపాయలు క్యాష్ అపహరణ ఇంటి యజమానులు ఊరికి వెళ్లడంతో ఉదయం వచ్చి దొంగతనం జరిగినట్లు గుర్

లీగల్ అడ్వైజర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ కావలి మునిసిపల్ ఉద్యోగి విషయం కలకలం రేపింది. కావలి మున్సిపాల్టీలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జంషేర్ ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టేసింది.

బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని సూరత్‌ కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌ ఎయిర్‌పోర్టుకు ఎయిరిండియా విమానంలో వచ్చిన గణేశ్‌ వలోద్రా అనే వ్యక్తి బ్యాగును కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగులో ఉన్న సూట్‌కేసు కవర్‌లో 500 గ్రాముల బంగారు రేకులు దాచినట్లు గుర్తించి..సీజ్‌ చేశారు.

రేవంత్ రెడ్డి కోసం భారీ సంఖ్యలో చర్లపల్లి చేరుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు. కార్యకర్తలను చెల్లాచెదురు చేస్తున్న పోలీసులు. రేవంత్ రెడ్డిని జైలునుంచి ఎస్కార్టుగా ఆయన్ను ఇంటివద్ద దించే వ్యూహరచనలో పోలీసులు. రేవంత్ రెడ్డిని తరలించే రూటును గోప్యంగా ఉంచుతున్న పోలీసులు.

Continue Reading

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(11-03-2020)

Published

on

By

వారణాసిలోని ప్రహ్లాదేశ్వర స్వామి ఆలయంలో అక్కడి పూజారులు కూడా మాస్కులు ధరించే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పూజారి విశ్వనాథుడి విగ్రహానికి, మందిరంలోని ఇతర విగ్రహాలకు కూడా మాస్కులు ధరించడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా విగ్రహాలను ముట్టుకోవద్దంటూ పూజారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేశారని.. ఇప్పుడు వాటిని తొలగించడానికి సుమారు రూ.3 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఆ డబ్బు వైకాపా నేతలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా పాఠశాల వసతుల కల్పనపై సీఎం జగన్‌ ఎలా మాట్లాడతారని చంద్రబాబు ప్రశ్నించారు. జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు ఇచ్చే వస్తువులపై సీఎం మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ జగన్‌కు వర్తించదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆరు రకాల వస్తువులు విద్యాకానుకలో ఉండనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మూడు జతల యూనిఫామ్స్‌, నోటు పుస్తకాలు, బూట్లు, సాక్స్‌, బెల్టు, బ్యాగు, పాఠ్య పుస్తకాలు ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌లో ఉంచాలని సీఎం సూచించారు. విద్యార్థులకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. డిజిటల్‌ విద్యాబోధనకై ప్రతి పాఠశాలకూ స్మార్ట్‌ టీవీలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

పులివెందులకు చెందిన తెదేపా నేత సతీశ్‌రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు. పులివెందులలో వైఎస్‌ కుటుంబం బలం, బలహీనతలు ఏంటో తనకు తెలుసని బీటెక్‌ రవి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్‌నేత జ్యోతిరాదిత్యసింధియా రాజీనామా చేసిన సంగతి విదితమే. త్వరలోనే ఆయన భాజపాలో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సింధియా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం ద్వారా తన నానమ్మ కోరిక తీర్చాడని ఆయన మేనత్త వసుంధరరాజే అన్నారు. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ భాజపా నేత అయిన వసుంధర మాట్లాడుతూ కుటుంబమంతా కలిసిఉండాలని చనిపోయేముందు తన తల్లి విజయరాజేసింధియా కోరిందని ఆమె తెలిపారు.

ఎన్నికల ప్రక్రియకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ఈసీ పరిధిలోని అంశమని అన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చీకటి పాలనలో అన్నీ నల్లచట్టాలు, నల్ల జీవోలు, బ్లాక్ డేలేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లను భయపెట్టడం, ప్రతిపక్షాల అభ్యర్థులను పోటీకి రాకుండా చేసేందుకే ఈ చీకటి ఆర్డినెన్స్ దొడ్డిదారిన తెచ్చారని యనమల దుయ్యబట్టారు.

ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ రాఘవా లారెన్స్‌ తమ్ముడు వినోద్‌ తనను వేధిస్తున్నాడని జూనియర్‌ ఆర్టిస్టు దివ్య ఫిర్యాదు చేశారు. వరంగల్‌కు చెందిన ఆమె రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. వినోద్ ప్రేమను తిరస్కరించడంతో తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని తెలిపారు. లైంగికంగా వేధించడంతోపాటు వ్యభిచార కూపంలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మహమ్మారి ఆ దేశం వెలుపల అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటికే 100 దేశాలకు పైగా ఈ వైరస్‌ విస్తరించింది. ఇక ఇటలీ, ఇరాన్‌ దేశాల్లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇరాన్‌లో మంగళవారం ఒక్కరోజే 54 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 291కు పెరిగింది. ఇరాన్‌ వ్యాప్తంగా 8వేలకు పైగా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కరోనావైరస్‌ వ్యాప్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెడుతుందనే ఊహాగానాలతో అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ అస్తులకు 5.8 బిలియన్‌ డాలర్ల మేరకు నష్టం వాటిల్లింది. దీంతో ఆసియాలోనే అత్యంత ధనవంతుల చిట్టాలో మొదటి స్థానం అయన చేజారిపోయింది. కాగా ఆ స్థానంలోకి అలీబాబా సంస్థ అధినేత జాక్‌ మా వచ్చి చేరారు.

నేటితరం యువత తమ భావాలను ఎప్పటికప్పుడు సమాజంతో పంచుకోవాలనుకుంటోంది. ఇందుకు తమకు ఉన్న సులభమైన మార్గం సోషల్‌ మీడియా. చాలామంది సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను పోస్టు చేస్తుంటారు. ఈ క్రమంలో తన వినియోగదారుల కోసం వినూత్నమైన ఫీచర్లను ప్రవేశపెట్టే సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే క్రాస్‌ పోస్టింగ్‌. అదేంటో చూసేయండి.

కరోనావైరస్‌ వ్యాప్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెడుతుందనే ఊహాగానాలతో అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ అస్తులకు 5.8 బిలియన్‌ డాలర్ల మేరకు నష్టం వాటిల్లింది. దీంతో ఆసియాలోనే అత్యంత ధనవంతుల చిట్టాలో మొదటి స్థానం అయన చేజారిపోయింది. కాగా ఆ స్థానంలోకి అలీబాబా సంస్థ అధినేత జాక్‌ మా వచ్చి చేరారు. కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం తగ్గింది. అంతే కాకుండా చమురు ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఉత్పత్తి ధరల యుద్ధం దీనికి మరో కారణమైంది. దీంతో చమురు ధరలు 29 సంవత్సరాల కనిష్ఠానికి క్షీణించాయి. చమురు ధరల ప్రభావం అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌పై పడింది. ఈ భారతీయ దిగ్గజ సంస్థ షేర్ల విలువ సోమవారం 12 శాతం వరకూ పడిపోయాయి. అదే సమయంలో కరోనా ప్రభావం చైనా ఆధారిత సంస్థ అలీబాబాపై కూడా పడినప్పటికీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మొబైల్‌ యాప్‌ల ద్వారా వాణిజ్యం పుంజుకోవటంతో ఆ నష్టం భర్తీ అయింది. ఈ పరిణామాల అనంతరం ప్రస్తుతం జాక్‌ మా ఆస్తుల విలువ 44.5 బిలియన డాలర్లు కాగా.. ఇది ముకేశ్‌ కంటే 2.6 బిలియన్‌ డాలర్లు అధికం.

కార్పొరేట్‌ రుణాల బకాయిలు, అంతర్గత అవకతవకల కారణంగా కష్టాల్లో కూరుకుపోయిన యెస్‌బ్యాంక్‌లో సమూల మార్పులు తీసుకురావాలని అడ్మిన్‌స్ట్రేటర్‌ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. దీనిలో భాగంగా కార్పొరేట్‌ రుణాలను విక్రయించే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. బ్యాంక్‌ను కార్పొరేట్‌ రుణ వ్యాపారం నుంచి రిటైల్‌ లోన్‌ వ్యాపారం వైపు మళ్లిస్తామని పేర్కొన్నారు. ఆర్‌బీఐ హామీ ఇచ్చాక బ్యాంక్‌ ఏటీఎంల వద్ద క్యూ తగ్గిందన్నారు. బ్యాంక్‌పై ప్రజలకు నమ్మకం తగ్గలేదని ప్రశాంత్‌కుమార్‌ చెప్పారు. ఎస్‌బీఐ 49శాతం పెట్టుబడి పెట్టనుండటం బ్యాంక్‌పై తొలుత నమ్మకాన్ని పెంచిందన్నారు. దీంతోపాటు బ్యాంక్‌ రిసొల్యూషన్‌ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుండటం, దీనికి ఆర్‌బీఐ, ఎస్‌బీఐ మద్దతు ఉండటంతో ప్రజలు కొంత స్థిమితపడ్డారని వెల్లడించారు. వీటికి తోడు బ్యాంక్‌ మూలధన సేకరణ ప్రణాళికలు సిద్ధం కావడం ప్రజల్లో విశ్వాసం పెంచిందని వివరించారు. మార్చి14వ తేదీన బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. డిపాజిట్లను విత్‌డ్రాచేసుకొనే కస్టమర్ల అవసరాలు తీర్చడం తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు.

82శాతం మంది మహిళలు వారి పెట్టుబడులను స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారని ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ‘గ్రో’ సర్వేలో వెల్లడయింది. ఈ సర్వేలో 26వేల మంది మహిళలు పాల్గొనగా 43శాతం మంది సంప్రదాయ పెట్టుబడులైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఇక అత్యధికంగా.. 25శాతం మంది బంగారంపై పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు. ఇక రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 13శాతం, పెన్షన్‌ పథకాల్లో 9శాతం మంది మహిళలు పెట్టుబడులు పెట్టినట్టు ఈ సర్వేలో వెల్లడైంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం. లక్ష్మీ అనే వివాహిత హత్య. మృతదేహం ఎదుట దీపం, పసుపు కారం. కాలి వేళ్ళు కత్తిరింపు. ప్రతీకారమా. క్షుద్రతతంగమా?కొనసాగుతున్న దర్యాప్తు.

వెల్దుర్తి మండలం బోదలవీడు గ్రామంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్ది పై బీరు బాటిళ్ళతో టీడీపీ కార్యకర్తల దాడిక్షతగాత్రుని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుకైనా వైద్యం కోసం గుంటూరు తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

పాల వ్యాన్‌ను లారీ ఢకొన్న ఘటన మంగళవారం ఉదయం పెదపాడు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పెదపాడు జాతీయ రహదారిపై, పాల వ్యాన్‌ను, లారీ ఢకొనడంతో, వ్యాన్‌ బోల్తాపడింది. పాల ప్యాకెట్ల సరుకంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడింది. వ్యాన్‌లో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణాపాయమేమీ జరగలేదు.

ఇద్దరూ డాక్టర్లు.. ప్రేమ వివాహం చేసుకున్నారు! సొంత ఆస్పత్రి ఉంది!! వారి అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తుగా పదేళ్ల బాబు ఉన్నాడు. అన్నీ ఉన్నా.. అందరి జీవితాల్లో లాగే వారి జీవితంలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. భర్త మీద కోపంతో భార్య పుట్టింటికి వెళ్లిపోతే.. భార్య మీద కోపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు! తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో తలకు గురిపెట్టుకుని.. పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చుకుని ఉసురుతీసుకున్నాడు. హైదరాబాద్‌ కాప్రా పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన విషాదమిది. బలవన్మరణానికి పాల్పడిన ఆ వ్యక్తి.. దమ్మాయిగూడలోని శ్రీఆదిత్య హాస్పటల్స్‌ ఎండీ డాక్టర్‌ రవీంద్రకుమార్‌. సిద్దిపేటకు చెందిన డాక్టర్‌ రవీంద్రకుమార్‌ (42) ఆయన భార్య స్మిత(36)ది ప్రేమ పెళ్లి.

హనుమంతుని పేట రైల్వే గేట్ దగ్గర, మాస్టర్ సిద్ధార్థ స్కూల్ టాటా ఏసీ వ్యాన్ బోల్తా. 15మంది విద్యార్థులకు గాయాలు. 108 అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

ఇద్దరు ఏసీ మెకానిక్‌లు ఘర్షణపడి గొడ్డలితో దాడి చేసుకున్న ఘటన మంగళవారం కాకినాడలో చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాల త్రిపుర సుందరి గుడి, ఘంటసాల విగ్రహం వద్ద ఇద్దరు ఏసీ మెకానిక్‌లు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి గొడ్డలితో అవతలి వ్యక్తిని నరకడంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరి మధ్య ఉన్న పాత గొడవల నేపథ్యంలోనే ఈ పరస్పర దాడులు చేసుకున్నట్లు సమాచారం. తీవ్రగాయాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా పై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి. 1,68,750 రూపాయలు విలువ చేసే గుట్కాస్ స్వాధీనం. ముగ్గురి అరెస్ట్, వాహనం స్వాధీనఒ.

Continue Reading

FAST NEWS

ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట…(10-03-2020)

Published

on

By

తండ్రి మృతదేహాన్ని చూసేందుకు అమృత పోలీసుల భద్రతతో స్మశానవాటికకు వెళ్ళినా ఆమెకి చుక్కెదురు అయింది. . మారుతీరావు కుటుంబ సభ్యులు, స్థానికులు అమృత గో బ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత తండ్రిని చివరి చూపు చూడకుండానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే వెను తిరిగింది. తండ్రి చావుకు కారణమైన అమృత గో బ్యాక్‌, మారుతీరావు అమర్‌ రహే అంటూ అక్కడి వారు నినాదాలు చేశారు. తన తండ్రిని చూడాలని అమృత భావిస్తే, తానేమీ అడ్డుకోబోనని, ఈ విషయంలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని మారుతీరావు సోదరుడు శ్రవణ్ ఇంతకు ముందు క్లారిటీ ఇచ్చారు. ఇంటి వద్దకు కాకుండా స్మశానానికి తీసుకుని వెళతామని చెప్పి, ఆమెను భారీ బందోబస్తు మధ్య పోలీసు వాహనంలోనే తీసుకుని వచ్చారు. అయినా ఆమె వచ్చేందుకు వీల్లేదంటూ, పలువురు స్థానికులు, బంధువులు నినాదాలు చేయడంతో, ఆమె వెనుదిరిగి వెళ్లిపోయింది.

తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు అమృత పోలీసుల భద్రత కోరింది. అయితే తండ్రిని చూసేందుకు తల్లి గిరిజ, బాబాయి శ్రవణ్ అంగీకరించలేదు. మారుతీ రావు స్వగృహంలో మృతదేహానికి బంధువులు, సన్నిహితులు నివాళులు అర్పిస్తున్నారు. ఉదయం 10 గంటలకు మారుతీరావు అంతిమయాత్ర మొదలు కానుంది. మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటిక (షాబునగర్) లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మారుతీరావు పోలీసులు అంతిమ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బంగారంలాంటి కూతురు.. అల్లుడు, పండంటి మనుమడితో అందమైన జీవితాన్ని గడపకుండా కులమే అడ్డుగోడలు స అష్టించిందంటూ నటి మాధవీలత మారుతీరావు ఆత్మహత్యను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘కూతురిని జీవితకాలపు విషాదంలోకి నెట్టివేసిందీ.. తన భార్యను శోకంలో ముంచిందీ.. ఈయన జీవితాన్ని నేరమయం చేసి.. శిక్ష పడక ముందే కుల సంఘం సత్రంలోనే చివరకి హరించిందీ.. పాపం ప్రేమించిన నేరానికి హత్యతో శిక్షించిందీ.. ఆ హత్య తప్పుకాదు అని మాట్లాడే దుర్మార్గులను స అష్టించిందీ కులమే.. ఇంకేమీ కాదు… కులమే’ అని ఆమె పేర్కొన్నారు.రాజకీయంలో భాగమవుతూ కులం ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ఆమె చెప్పారు. వివక్షకు పునాది వేసి, ద్వేషానికి పాలు పోస్తూ, ‘సామాజిక వర్గం’ గా చెలామణీ అవుతున్న సామాజిక నేరం కులమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుల విష సర్పం నేడు సిగ్గు విడిచి, కొత్త దర్పం చూపిస్తున్నదని, ఒకప్పటి, నేటి, బాధితుల ద్వారానే వ్యాప్తి చెందుతుందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

వరంగల్ రైల్వే స్టేషన్లు రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించిన వివాహిత కొమ్ముల లత(27). ను కాపాడిన గ్ర్ప్. భర్త వేధింపులు భరించలేక, రైలు కిందపడి చనిపోయేందుకు నర్సంపేట నుండి వచ్చినట్లు చెబుతున్న కొమ్ముల లత తెలిపింది.

పురుగుల మందు తాగి, ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కూసుమంచి మండలం, బలియా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు కళ్యాణ్‌ (22).. పాలేరు రిజర్వాయర్‌ అలుగు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు.. అతడి కుటుంబానికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారిస్తున్నారు. మృతుడి వ్యవహార శైలి, ఇటీవల అతని ప్రవర్తనకు సంబంధించిన విషయాలపై విచారణ చేపట్టారు.

అనంతపురం జిల్లా లేపాక్షి మండలం చోళసముద్రం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం రోడ్డుపై నిల్చున్న తల్లీకుమార్తెపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కుమార్తె సుజాత(38) మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన తల్లి నరసమ్మను సమీప ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పురుగులు పట్టిన చాక్లెట్‌ను విక్రయించి వినియోగదారు కూతురు అనారోగ్యానికి కారణమైన మోర్‌ మెగాస్టోర్‌పై హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం-3 మండిపడింది. తినుబండారాల సంరక్షణ పద్ధతులు పట్టించుకోనందుకు రూ.36,080 జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన కోమరగిరి సుబ్బారావు తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఎర్రమంజిల్‌లోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌లో 2018 అక్టోబర్‌ 11న చాక్లెట్‌లు కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఫిర్యాదుదారు కూతురు క్యాడ్బరీ డైరీ మిల్క్‌ ఫ్రూట్‌ అండ్‌ నట్‌ చాక్లెట్‌ను కొద్దికొద్దిగా తింటూ ఉండగా అందులో పురుగులు ఉన్నాయని సుబ్బారావు కుమారుడు గమనించి అరిచాడు.

పాకిస్థాన్ లో ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. రావల్పిండి నుంచి స్కర్దుకు వెళుతున్న బస్సు ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సైనిక హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలను ప్రారంభించారు. ఇప్పటివరకు 8 మంది మృతదేహాల్ని బయటికి తీసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పురుగులు పట్టిన చాక్లెట్‌ను విక్రయించి వినియోగదారు కూతురు అనారోగ్యానికి కారణమైన మోర్‌ మెగాస్టోర్‌పై హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం-3 మండిపడింది. తినుబండారాల సంరక్షణ పద్ధతులు పట్టించుకోనందుకు రూ.36,080 జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన కోమరగిరి సుబ్బారావు తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఎర్రమంజిల్‌లోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌లో 2018 అక్టోబర్‌ 11న చాక్లెట్‌లు కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఫిర్యాదుదారు కూతురు క్యాడ్బరీ డైరీ మిల్క్‌ ఫ్రూట్‌ అండ్‌ నట్‌ చాక్లెట్‌ను కొద్దికొద్దిగా తింటూ ఉండగా అందులో పురుగులు ఉన్నాయని సుబ్బారావు కుమారుడు గమనించి అరిచాడు. ఈ విషయాన్ని సూపర్‌ మార్కెట్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా పెద్దగా స్పందించలేదు. చాక్లెట్‌ తిన్న కొద్దిసేపటికే ఫిర్యాదుదారు కూతురు అనారోగ్యానికి గురైంది. దవాఖానాకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఫుడ్‌ పాయిజన్‌ అయ్యిందని తెలిపారు. క్యాడ్బరీ చాక్లెట్‌ కంపెనీ, మోర్‌ మెగా స్టోర్‌పై చర్యలు తీసుకోవాలంటూ సుబ్బారావు హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. పంపిణీ చేసిన చాక్లెట్‌లను భద్రపరిచేందుకు విజి కూలర్లను విక్రయదారులకు ఇస్తున్నామని, లేబుళ్లపై కూడా ‘పరిశుభ్రమైన, చల్లని ప్రదేశంలో భద్రపరిచాలని’ పేర్కొంటున్నట్లు క్యాడ్బరీ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఫిర్యాదుదారు వాదనలను కొట్టిపారేసిన మోర్‌ మెగాస్టోర్‌, సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని ఫోరానికి వివరించింది. వాద, ప్రతివాదనలు విన్న అనంతరం.. తినుబండారాల సంరక్షణపై మోర్‌ మెగాస్టోర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రుజువైందని హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం-3 పేర్కొంది. ఉత్పత్తి కంపెనీ తప్పేమీ లేదని నిర్ధారించింది. చాక్లెట్‌ ఖరీదు రూ.80, వైద్య ఖర్చులకు అయిన రూ.1,000తోపాటు, పరిహారంగా రూ.25,000, ఖర్చుల కింద మరో రూ.10,000 వినియోగదారుడికి చెల్లించాలని మోర్‌ మెగాస్టోర్‌ను అధ్యక్షుడు నిమ్మ నారాయణ, సభ్యుడు జి.శ్రీనివాసరావుతో కూడిన బెంచ్‌ ఆదేశించింది. 30 రోజుల వ్యవధిలో ఈ మొత్తాన్ని చెల్లించాలని లేని పక్షంలో 9 శాతం వడ్డీతో చెల్లించాలని హెచ్చరించింది.

నగరంలోని ఆర్‌సీఐ కాలనీకి చెందిన నేత్రపాల్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విజ్ఞానకంచ శాఖలో ఖాతాదారుడు. 2016 నవంబర్‌ 3న తన ప్రమేయం లేకుండానే ఖాతా నుంచి రూ.15,001 ఓ సారి, 2017 నవంబర్‌ 3న మరోసారి రూ.15,054 నగదు మాయమైనట్లు సందేశం వచ్చింది. నేత్రపాల్‌ రెండు పర్యాయాలు బ్యాంకుకు వెళ్లి ఈ విషయంపై ఆరా తీయగా ఖాతాదారుకి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో పాలసీ ఉందని, ఆ డబ్బు ఆటో డెబిట్‌ అయిందని తేలింది. దీంతో ఆటోడెబిట్‌ మ్యాండేట్‌ కోసం ఫిర్యాదుదారు ఇచ్చిన దరఖాస్తు తీసుకురావాలని ఫోరం ఆదేశించింది. నేత్రపాల్‌ పాస్‌బుక్‌లో సంతకం, ఆటోడెబిట్‌ మ్యాండెట్‌లో సంతకం సరిపోలకపోవడంతో ఈ విషయంలో తప్పునకు బాధ్యులు ప్రతివాదులే అని ఫోరం గుర్తించింది. వినియోగదారు ఫిర్యాదును పట్టించుకోని ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతివాదులైన ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సంయుక్తంగా రూ.30,055 వినియోగదారుడికి చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.20,000, కేసు ఖర్చుల కింద మరో రూ.10,000 చెల్లించాలని ఫోరం-2 ఆదేశించింది.

కరోనా ప్రభావం స్టాక్‌మార్కెట్ల నుంచి ముడిచమురు సహా కమాడిటీ వరకూ అన్ని మార్కెట్లనూ బెంబేలెత్తిస్తోంది. చమురు ధరలు ఆసియాలో సోమవారం 20 ఏళ్ల కనిష్ట స్ధాయిలో ఏకంగా 30 శాతం పడిపోయాయి. డెడ్లీ వైరస్‌తో డిమాండ్‌ పడిపోవడంతో ఉత్పత్తిలో కోత విధించాలనే ఒప్పందంపై ఒపెక్‌, భాగస్వామ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలతో సౌదీ అరేబియా ధరలను అమాంతం తగ్గించివేసింది. చమురు ఉత్పత్తిని తగ్గించడంపై ఒపెక్‌ దేశాలు, రష్యా మధ్య జరిగిన చర్చలు విఫలమైన అనంతరం సౌదీ ఆరాంకో ధరలను భారీగా తగ్గించింది. సౌదీ ప్రైస్‌ వార్‌తో ఆసియాలో బ్యాంరెల్‌ ముడిచమురు ధర ఏకంగా 32 డాలర్లకు పడిపోయింది. కరోనా షాక్‌తో ఆర్థిక వఅద్ధి తగ్గుముఖం పట్టే క్రమంలో రానున్న నెలల్లోనూ ముడిచమురు ధరలు దిగివస్తాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌. ఇతర దేశాలను వణికిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్‌ లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు మూడు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన బంగ్లాదేశ్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 17వ తేదీన బంగ్లాదేశ్‌ లో జరగనున్న షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ శతాబ్ధి జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆ దేశ ప్రధాని షేక్‌ హాసినా మోడీని ఆహ్వానించారు. దీంతో ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌ కు వెళ్లాలనుకున్నారు. కానీ అక్కడ మూడు కరోనా కేసులు నమోదు కావడంతో.. తన పర్యటనను వాయిదా వేసుకోవాలని మోడీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది. కరోనా వైరస్‌ కారణంగా బ్రసెల్స్‌ పర్యటనను కూడా మోడీ రద్దు చేసుకున్నారు.

ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా (కొవిడ్‌ 19) కేసులు భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒకరు అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన బెంగళూరు వాసి కాగా.. మరొకరు ఇటలీ నుంచి తిరిగొచ్చిన పంజాబ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 45కు చేరింది. అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వెల్లడించారు. వైరస్‌ సోకిన వ్యక్తిని ఆయన కుటుంబాన్ని బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఛాతి వైద్యశాలలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచినట్లు చెప్పారు. బాధితుడు మొదట అమెరికాలోని ఆస్టిన్‌ నగరానికి ప్రయాణించి అక్కడి నుంచి న్యూయార్క్‌, దుబాయ్‌ మీదుగా భారత్‌ చేరుకున్నట్లు సమాచారం. ఇక రెండో కేసు పంజాబ్‌లో నమోదైంది. పంజాబ్‌ రాష్ట్రంలో తొలిసారి నమోదైన కరోనా కేసు ఇదే. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు పంజాబ్‌ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇటలీలో కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకు 366 మంది మరణించగా.. 7వేల మందికి పైగా ఈ మహమ్మారి బారినపడి చికిత్సపొందుతున్నారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఆయా రోజుల్లో దుకాణాలకు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అనిల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

యెస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్‌తో పాటు మరో ఆరుగురు నిందితులపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ) లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. రూ.4,300కోట్ల లావాదేవీల విషయంలో రానాకపూర్‌ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణ నిమిత్తం ఇప్పటికే ఆయనను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ముంబయిలోని కోర్టులో హాజరుపర్చారు. కాగా.. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 11 వరకు రిమాండ్‌ విధించింది.

ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో వేడెక్కిన మధ్యప్రదేశ్‌ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కనపడకుండా పోయారు. అనంతరం బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. ఈ ఎమ్మెల్యేలంతా బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 17 మంది కాంగ్రెస్‌ ముఖ్య నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులని సమాచారం. ప్రస్తుతం సింధియా ఫోన్‌ స్విచాఫ్‌ వస్తున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అదృశ్యమైన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారనీ.. వీరంతా చార్టర్‌ విమానంలో బెంగళూరుకు చేరుకున్నట్టు సమాచారం.

భారత్‌ చేతి చమురు వదులుతోంది.. చమురు రేట్లు పెరిగిన ప్రతిసారీ ఈ మాటలు మనకు వినపడుతుంటాయి. కానీ, చమురు ఉత్పత్తిదారుల మధ్య నెలకొన్న పోటీలో భారత్‌ లబ్ధిదారుగా నిలిచే అవకాశం లభించింది. వాణిజ్యలోటును తగ్గించుకొనే సువర్ణావకాశం దక్కింది. చమురు ధర పెరిగితే భారత్‌ నష్టపోతుంది.. ధర తగ్గితే లాభపడుతుంది.. అసలే మందగమనంలో ఉన్న సమయంలో దేశంలో వాణిజ్యలోటు పెరగకుండా జాగ్రత్త పడాలి.. ఈ నేపథ్యంలో భారత్‌కు అనుకోని వరంలా అంతర్జాతీయ పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఒపెక్‌+రష్యా మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఫలితంగా బ్రెంట్‌ చమురు ధర బ్యారెల్‌కు 33 డాలర్లకు తగ్గడం కలిసొచ్చే అంశంగా మారింది. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌ (ఒపెక్‌) ఆధ్వర్యంలో పెట్రోల్‌ ఉత్పత్తి చేసే దేశాలు ఒక సంఘంగా ఏర్పడి చమురు ఉత్పత్తి పెంచాలా..? తగ్గించాలా..? అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. చమురు డిమాండ్‌ తగ్గగానే ఉత్పత్తిని కూడా తగ్గించి ధరను కాపాడుకొంటాయి..! ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుడైన భారత్‌కు డిమాండ్‌ సూత్రం ప్రకారం ప్రయోజనం లభించాలి. కానీ, ఒపెక్‌ కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ధర నిలకడగా ఉండి.. అదే స్థాయిలో ధర చెల్లించాల్సి వస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మన మార్కెట్లలో వ్యాపారులంతా సిండికేటై ధరను ఎలా నియంత్రిస్తారో.. ఒపెక్‌ కూడా అలానే చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను చట్టబద్ధంగా అమలు చేయించుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం జగన్‌ కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం జగన్‌కు కేవీపీ లేఖలు రాశారు. పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ, కేంద్రప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వాలని మోదీకి రాసిన లేఖలో కోరారు. విభజన చట్టం అమలుపై రాజ్యసభలో మరోసారి ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టానని.. కానీ దురదృష్టవశాత్తు అది చర్చకు రాలేదన్నారు.

రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసే అన్నింటినీ తొలగించడం ఆనవాయితీ అని.. ఇప్పటి వరకు ఎక్కడా ఆ ప్రక్రియ చేపట్టలేదని ఆయన విమర్శించారు. ఇష్టారీతిన రిజర్వేషన్లు, సరిహద్దులు మారుస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన రిజర్వేషన్లు మార్చేస్తారా? అని ప్రశ్నించారు.

Continue Reading

Trending

www.vsbnews.in