Connect with us

Hi, what are you looking for?

Entertainment

ఒక్క యాడ్.. దేశవ్యాప్తంగా దుమారం

https://youtu.be/Lli_q473J3U

ప్రముఖ ఆభరణాల సంస్థ ‘తనిష్క్’ తాజాగా విడుదల చేసిన ఒక యాడ్ పై నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జాతీయ వాదులు ఈ యాడ్ పై మండి పడి ట్రోల్స్ చేశారు. తనిష్క్ వాణిజ్య ప్రకటనతో ‘లవ్ జిహాద్’ను ప్రచారం చేస్తోందని సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ట్విట్టర్ లో అయితే ‘బాయ్ కాట్ తనిష్క్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు.

దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ ను ప్రేరేపించేలా ఆ యాడ్ ఉందన్న విమర్శలు రావడంతో తనిష్క్ ఆభరణాల సంస్థ వెనక్కి తగ్గింది. తన యాడ్ ను వెంటనే ఉపసంహరించుకుంది.

తాజాగా తన కొత్త జ్యువల్లరీగా ‘ఏకత్వం’ పేరుతో తనిష్క్ కొత్త ఆభరణాలు లాంచ్ చేసింది. ఇందుకు సంబంధించిన యాడ్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. టీవీల్లోనూ ప్రకటన చేసింది.

ఈ యాడ్ లో ఒక హిందూ యువతి పెళ్లి చేసుకొని ముస్లిం కుటుంబంలోకి అడుగుపెట్టింది. సీమంతం సందర్భంగా ఆ ఇంటిలో హిందూ సంప్రదాయంలో ఏర్పాట్లు ఉండడంతో ఆమె ఆశ్చర్యపోయేలా యాడ్ తీర్చిదిద్దారు.రెండు మతాలు సంస్కృతుల కలయిక అన్నట్టుగా ఈయాడ్ లో తనిష్క్ చూపించింది.

అయితే ఈ యాడ్ ‘లవ్ జిహాద్’ను ప్రేరేపించేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతోపాటు ‘తనిష్క్’ను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిచింది. దీంతో తనిష్క్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం నుంచి ఆ యాడ్ ను తొలగించింది.

అయితే అప్పటికే ఆ వీడియోను సేవ్ చేసుకున్న వీడియోను షేర్ చేస్తూ తనిష్క్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరు మాత్రం తనిష్క్ కు సపోర్టు చేస్తూ అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ తనిష్క్ యాడ్ కు మద్దతు తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

You May Also Like

Devotional

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన : శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే ! య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !! శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట … శ్రీ...

Devotional

తృతీయ అధ్యాయము  బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ‘రాజా! స్నాన, దాన, జపతాపాలలో ఏది కానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా...

Movies

Facebook Twitter LinkedIn WhatsApp

News

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామంలో ఉంటున్న జ్యోతికి వెన్నెముకకు గాయం అయ్యి ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు అవసరం అని తెలిసిన వెంటనే లక్ష్య స్వచంద సంస్థ వారు తమ సభ్యుల...