Connect with us

Hi, what are you looking for?

Politics

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ…

ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించబోవు శాసనసభ, శాసనపరిషత్తు సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఈరోజు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన పరిషత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. సభలో సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణం, సభ లోపల పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించాలని శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులుని ఆదేశించారు. సమావేశాల బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌తో, సమావేశాలలో అవసరమైన సమాచారంపై చీఫ్ సెక్రటరీతో స్పీకర్ పోచారం ఫోన్లో మాట్లాడారు.సమావేశాలకు హాజరయ్యే శాసనసభ, శాసన పరిషత్తు సభ్యులు, ఉభయ సభల సిబ్బంధి, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బందిలలో ఎవరికైనా అనుమానంగా ఉన్నా లేదా కరోనా లక్షణాలు కనిపించినా ఉభయ సభల ప్రాంగణాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెస్టింగ్ కేంద్రాలలో తప్పక పరీక్షలు చేయించుకోవాల్సిందిగా స్పీకర్ పోచారం, చైర్మన్ గుత్తా సూచించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

You May Also Like

Devotional

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన : శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే ! య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !! శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట … శ్రీ...

News

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామంలో ఉంటున్న జ్యోతికి వెన్నెముకకు గాయం అయ్యి ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు అవసరం అని తెలిసిన వెంటనే లక్ష్య స్వచంద సంస్థ వారు తమ సభ్యుల...

Devotional

ఏడవ అధ్యాయం ‘ఓ జనక రాజేంద్రా! కల్మష అగ్ని అయిన కార్తీకమాసంలో పుష్ప అర్చన, దీపవిధానాలు చెబుతాను విను. పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషాలు ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం...

Politics

– మంత్రి హరీశ్ రావు.. – టి ఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేసిన దుబ్బాక ప్రజల కు ధన్యవాదాలు.. – ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు.....