Connect with us

Hi, what are you looking for?

TV

వన్యప్రాణి సంరక్షణ ప్రతి ఒక్కరి ప్రాథమిక విధి…

మనకు ఆశ్రయం ఇస్తున్న ప్రకృతిని, అందులో మనతోపాటు జీవిస్తున్న ఇతర ప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది అని రాజమండ్రి సర్కిల్ అటవీ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు అన్నారు. వన్యప్రాణి సంరక్షణ ప్రతి భారతీయుడి ప్రాథమిక విధి అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51  ఎ (జి) చెబుతోందన్నారు. సప్తాహాన్ని రాజమండ్రి సర్కిల్ కార్యాలయంలో అటవీ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. వన్యప్రాణి విభాగం రూపొందించిన పోస్టర్లను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అహింసకు ప్రతి రూపమైన మహాత్మా గాంధీ జయంతి నాడే వన్యప్రాణి సప్తాహం మొదలవడంలోని అంతరార్థం అందరూ తెలుసుకోవాలన్నారు. వన్యప్రాణుల్ని కాపాడడమే ధ్యేయంగా 1952  నుంచీ ఏటా భారతదేశంలో వన్యప్రాణి సప్తాహం జరుగుతున్నదని ఆయన తెలిపారు. వన్యప్రాణులు అంతరిస్తే మానవుడి మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. రాజమండ్రి సర్కిల్ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో అటవీ శాఖా వన్యప్రాణి సప్తాహం సందర్భంగా వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది చెప్పారు. వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ విభాగం డీ ఎఫ్ ఓ సి.సెల్వం, అటవీ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ఎంవి ప్రసాదరావు, ఎఫ్ ఆర్ ఓ సునీల్ కుమార్, ఎఫ్ ఎస్ ఓ అశ్విన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

You May Also Like

Devotional

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన : శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే ! య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !! శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట … శ్రీ...

News

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట గ్రామంలో ఉంటున్న జ్యోతికి వెన్నెముకకు గాయం అయ్యి ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు అవసరం అని తెలిసిన వెంటనే లక్ష్య స్వచంద సంస్థ వారు తమ సభ్యుల...

Devotional

ఏడవ అధ్యాయం ‘ఓ జనక రాజేంద్రా! కల్మష అగ్ని అయిన కార్తీకమాసంలో పుష్ప అర్చన, దీపవిధానాలు చెబుతాను విను. పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషాలు ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం...

Politics

– మంత్రి హరీశ్ రావు.. – టి ఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేసిన దుబ్బాక ప్రజల కు ధన్యవాదాలు.. – ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు.....