Connect with us

Movies

చిరంజీవి సైరా మేకింగ్ వీడియో విడుదల…

Published

on

హైదరాబాద్ , ఆగష్టు 14 , VSB NEWS :

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా’  స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానుల కోసం స్వాతంత్ర దినోత్సవ కానుకగా ‘సైరా నరసింహారెడ్డి’ మేకింగ్ వీడియోను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది .

ఆగస్ట్ 14వ తేదీ సాయంత్రం 3.45 నిమిషాలకు సైరా మేకింగ్ వీడియో విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. రిలీజ్ అయిన క్షణం నుంచి సైరా మేకింగ్ వీడియో రప్ఫాడిస్తుంది. ముఖ్యంగా మేకింగ్ విషయంలో సురేందర్ రెడ్డి అదరగొట్టాడు. హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో సైరాను అత్యున్నతంగా తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. చిరంజీవితో పాటు నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్ లుక్స్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఆగస్ట్ 20న టీజర్ విడుదల కానుంది.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Movies

సోలో బ్రతుకే సో బెటర్‌’ నుంచి ‘నో పెళ్లి’ వీడియో సాంగ్‌ విడుదల

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , మే 27 , VSB NEWS :

 

హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడదులై ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ థీమ్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘నో పెళ్లి’ వీడియో సాంగ్‌ను చిత్రయూనిట్‌ విడుదలచేసింది.

బ్యాచ్‌లర్‌ జీవితమే గొప్పదంటూ, పెళ్లి చేసుకోవద్దంటూ ఈ పాటలో మెగా మేనల్లుడు సాయి తేజ్‌ తెలుపుతున్నాడు. ఇక ఈ పాటలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, ఈ మధ్యనే బ్యాచ్‌లర్‌ జీవితానికి ముగింపు పలికిన రానా దగ్గుబాటి కనిపించడం విశేషం. రఘురామ్‌ లిరిక్స్‌ అందించగా అర్మాన్‌ మాలిక్‌ ఆలపించగా యశ్వంత్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేశాడు.

క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు. యువతకు బాగా కనెక్ట్‌ అయిన ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ‘నో పెళ్లి’ పాట విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం మరో విశేషం. అంతేకాకుండా ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌లో ఈ పాట కొనసాగుతోంది

Continue Reading

Movies

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లు అర్జున్

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , ఏప్రిల్ 08, VSB NEWS :

 

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లు అర్జున్ గడ్డంతో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘పుష్ప’లో పుష్పరాజ్ క్యారెక్టర్ చేస్తున్నాడు బన్నీ. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రూపొందనుందీ చిత్రం. చిత్తూరు జిల్లాలోని స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు.

‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ బాగా టైమ్ తీసుకుని ‘పుష్ప’ స్క్రిప్ట్ రెడీ చేసాడని, సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని సమాచారం. రష్మికా కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి మ్యూజికల్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే బన్నీ, దేవి కాంబినేషన్‌లో వచ్చిన ‘బన్నీ’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘డీజే’ సినిమాలు మ్యూజికల్ హిట్స్‌‌గా నిలిచాయి. మరోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మ్యూజిక్ లవర్స్‌తో పాటు డాన్స్ లవర్స్‌ను కూడా ఆకట్టుకోబోతోంది.

Continue Reading

Movies

పుట్టిన రోజున డబుల్ ధమాకా

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , ఏప్రిల్ 08, VSB NEWS :

 

 అల్లు అర్జున్ పుట్టిన రోజున రెండు సరికొత్త అప్డేట్స్ మన ముందుకు వచ్చాయి. అలా వైకుంఠ పురంలో చిత్రం బ్లాక్ బస్టర్ విజయం తర్వాత అల్లు అర్జున్ వరుసగా రెండు ప్రాజెక్టులు చేసేందుకు అంగీకరించారు. అందులో ఒకటి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప. రెండో చిత్రం దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఐకాన్ చిత్రం. అయితే ఈ రెండు చిత్రాలకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజే వచ్చాయి. సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఈ రోజే విడుదల అయింది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఎలా ఉండబోతున్నారు అనేది ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తుంది. అయితే ఊర మాస్ గెటప్ లో అల్లు అర్జున్ దర్శనం ఇచ్చారు. సీరియస్ లుక్ తో ఉన్న అల్లు అర్జున్ పిక్ నీ విడుదల కొద్దిసేపటికే విపరీతంగా వైరల్ చేసేశారు. అయితే ఈ చిత్రం మిగతా బాషల్లో కూడా విడుదల కానుంది. మిగతా బాషల్లో సైతం పోస్టర్లు విడుదల చేసి అభిమానులకు మరింత అంచనాలు పెంచేశారు.

Continue Reading

Trending

www.vsbnews.in