Connect with us

News

కావలిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ రాములు పర్యటన…

Published

on

నెల్లూరు జిల్లా :

కావలిలో బి కే నగర్ శిథిలాల రణరంగం పై జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రాములు కావలెను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడంలో వెనుకాడేది లేదని కూల కొట్టబడిన స్థలం ప్రైవేటు వారిది అయితే ప్రభుత్వం వారితో సంప్రదించి నివాసం ఏర్పాటు చేస్తామని అదే ప్రైవేటు వ్యక్తులు కూలగొట్టినది స్పష్టమై తే అట్రాసిటీ కేసు నమోదు చేయమని చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. వివాదాలు పెంచే దిశలో రెవెన్యూ పోలీసులు దృష్టి పెట్టకుండా సమస్య కు స్వస్తి పలకాలని హితవు పలికారు ఇల్లు కోల్పోయిన వారికి నివాసం కల్పించే అంతవరకు మౌలిక వసతులు రెవెన్యూ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు మొత్తం మీద బీజేపీ నేత కందుకూరు సత్యనారాయణ ఒంటరిపోరు తో ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకు పోయి ఒక కొలిక్కి వచ్చేలా చేశారు.

Continue Reading
Advertisement
1 Comment

1 Comment

  1. Lakshman

    July 26, 2019 at 3:36 pm

    ఇది చాలా మంచిపని ఇలాంటి వారు వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది పేదలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇల్లు లేనివారికి చట్టప్రకారం న్యాయం జరగాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది….

Published

on

కరోనా వ్యాప్తి కట్టడికి పుల్లలచెరువులో క్షేత్ర స్థాయి అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిషేధిత ప్రాంతంగా ప్రకటించి, రెడ్ జోన్లో ఇంటింటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెళ్లి ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. వయో వృద్దులకు జాగ్రత్తలు తెలియజేసారు.ఎంపిడివో ఆదేశాలమేరకు పంచాయతీ కార్యదర్శి బాలూనాయక్ ఆధ్వర్యంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు. అన్ని వీధుల్లో బ్లీచింగ్ ,సోడియం హైపో క్లోరేట్ పిచికారీ చేయించారు. కరోనా బాధితురాలి ప్రైమరీ కాంటాక్ట్స్ ను 27 మందిని గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. బాధితురాలిని,కుటుంబ సభ్యులను ఐసోలేషన్ కు తరలించారు. అధికారులు, సిబ్బంది ఇక్కడే ఉండి కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. రహదారుల్లో ముళ్ళకంచలు ఏర్పాటు చేశారు. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు. ఎస్సై వెంకటేశ్వరరావు, తహసీల్దార్ అశోక్ రెడ్డి, ఎంపిడివో శ్రీనివాసులు, డాక్టర్ కిరణ్మయి, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. అధికారులు చేపడుతున్న చర్యలతో పుల్లలచెరువులో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. కరోనా కేసు నమోదు కావడంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు.

Continue Reading

News

బఫెట్‌ను వెనక్కి నెట్టేసిన ముఖేశ్…

Published

on

By

న్యూఢిల్లీ :

భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ అరుదైన ఘనత సాధించారు. సంపన్నుల జాబితాలో ఆయన అపర దానకర్ణుడిగా పేరుగాంచిన వారెన్‌ బఫెట్‌ను వెనక్కినెట్టారు.

బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు.

ఆసియా నుంచి టాప్‌-10లో ఉన్న ఒకే ఒక్కరు ముఖేశ్‌ కావడం గమనార్హం.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చాలని కంకణం కట్టుకున్న ముఖేశ్‌ ఆ పనిలో విజయవంతమైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆ సంస్థ విలువ 68.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

బఫెట్‌ సంస్థ బెర్క్‌షైర్‌ హాథ‌వే 67.9 బిలియన్‌ డాలర్లను దాటేసింది.

ఐతే‌ 2.9 బిలియన్‌ డాలర్లను విరాళంగా ఇవ్వడం, సంస్థ పనితీరు కాస్త మందగించడంతో బఫెట్‌ తొమ్మిదో స్థానానికి దిగిపోయారు.

2006లోనూ 37 బిలియన్‌ డాలర్లను విరాళం ఇవ్వడంతో ఆయన ర్యాంకు తగ్గిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగంలో ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ సహా కొన్ని కంపెనీలు 15 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

రిలయన్స్‌ చమురు రిటైల్‌ వ్యాపారంలో బీపీ పీఎల్‌సీ బిలియన్‌ డాలర్ల వాటా కొనుగోలు చేసింది.

మొత్తంగా 2020లో ఎంఅండ్‌ఏ ద్వారా 12శాతానికి పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Continue Reading

News

మందుబాబులు  మద్యం దుకాణాల ముందు బారులు….

Published

on

10 రోజులపాటు లాక్‌డౌన్

 

మహారాష్ట్రలోని పుణెలో జూలై 13 నుంచి 23 వరకూ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. పది రోజుల వరకూ మళ్లీ మద్యం దుకాణాలు తెరిచే అవకాశం లేకపోవడంతో స్టాక్ పెట్టుకోవాలని మద్యం ప్రియులు నిర్ణయించుకున్నారు.

కరోనా కట్టడికోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ముంబై తర్వాత పుణె జిల్లాలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పుణె జిల్లాలో గురువారం ఒక్కరోజే 1,803 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 1,032 కరోనా కేసులు ఒక్క పుణె నగరంలోనే నమోదయిన పరిస్థితి. ఇప్పటివరకూ 978 మంది కరోనా వల్ల మరణించారు. పుణెలో పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. కేవలం అత్యవసరాలకు మాత్రమే అనుమతినిచ్చింది.

Continue Reading

Trending

www.vsbnews.in