Connect with us

Weather

ఎడ తెరువు లేకుండా కురుస్తన్న భారీ వర్షాలు…

Published

on

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో తెల్లవారు జాము నుంచి ఎడ తెరువు లేకుండా కురుస్తన్న భారీ వర్షాలకు రహదారుల పై నీరు నిలిచిపోయింది . కోనసీమలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలతో పాటు ఈదురు గాలులు వీస్తుండటం తో సంబంధిత అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు . రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోనసీమలోనీ కొన్ని చోట్ల వరి చేలు నీట మునిగి గోదావరిని తలపిస్తున్నాయి.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Weather

మరో 3 రోజులు వేడి గాలులు

Published

on

ఆంధ్రప్రదేశ్ , విశాఖ, మే 27 , VSB NEWS :

 

రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు వేడిగాలులు, ఉక్కపోత కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం   వెల్లడించింది. పలు చోట్ల నిప్పుల వానలా ఎండ కాస్తుందని తెలిపింది. రాయలసీమలో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వివరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ బయటికి రావొ ద్దని అధికారులు సూచిస్తున్నారు

Continue Reading

Weather

మరో ఆరు రోజులూ ఈ భగభగలు కొనసాగనున్నాయి…

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి , VSB NEWS :

ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మరో ఆరు రోజులూ ఈ భగభగలు కొనసాగనున్నాయి.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గురువారం గుంటూరు జిల్లా భట్టిప్రోలు, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో గరిష్ఠంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.

ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 10 మండలాల్లో గురువారం 47 నుంచి 47.8 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో 75 మండలాల్లో వడగాలులు, 140 మండలాల్లో అధిక వేడి, 437 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది.

28 వరకు ఎండలు.. తర్వాత వానలు
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతుందని, శుక్రవారం నుంచి రాయలసీమలోనూ ప్రభావం అధికంగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

ఈ నెల 28 వరకు వడగాలులు వీస్తాయని తెలిపారు. 29 నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

నైరుతి రుతుపవనాలు జూన్‌ 5 నాటికి కేరళను తాకి, కొన్నిరోజులకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు.

వడగాలుల తీవ్రత పెరుగుతున్నందున జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

Continue Reading

Weather

పశ్చిమ బెంగాల్‌ వద్ద తీరం దాటిన ఆంఫన్‌ పెనుతుఫాన్‌

Published

on

ఆంధ్రప్రదేశ్ , విశాఖపట్నం , మే 22 , VSB NEWS :

 

పశ్చిమ బెంగాల్‌ వద్ద తీరం దాటిన ఆంఫన్‌ పెనుతుఫాన్‌ ప్రభావం.. కేరళకు నైరుతి రుతుపవనాల రాకపై ఉండబోదని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ముందుగా ప్రకటించినట్టు కేరళకు ఈ ఏడాది జూన్‌ 1న కాకుండా నాలుగైదు రోజుల ఆలస్యంగా  నైరుతి రుతుపవనాలు రానున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అరేబియా సముద్రంలో యాంటీ సైక్లోన్‌ కొనసాగుతున్నది. దీని వల్ల నైరుతి దిశ నుంచి గాలులు వీయడానికి కొంత ఆటంకం కలుగుతుంది.

ఇది పూర్తిగా బలహీనపడిన తర్వాతే అరేబియా సముద్రం మీదుగా నైరుతి గాలుల రాకకు వాతావరణం అనుకూలిస్తుందని నిపుణులు అంచనా వేశారు

Continue Reading

Trending

www.vsbnews.in