Connect with us

Politics

కేంద్రం వర్గీకరణకు ప్రయత్నిస్తే జగన్ అడ్డుకుంటారా..?

Published

on

– పి గన్నవరం టీడీపీ ఇంచార్జ్ నేలపూడి స్టాలిన్ బాబు

ఎస్సీ వర్గీకరణ అంశంపై తేదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేయకపోవడం ఏమిటని, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు ప్రయత్నిస్తే ఆయన అడ్డుకుంటారా? అని పి గన్నవరం టీడీపీ ఇన్చార్జి నేలపూడి స్టాలిన్ బాబు ప్రశ్నించారు. వర్గీకరణ అంశాన్ని గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సమర్థించడమే కాక, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపించిన విషయాన్ని మీరు మరిచిపోయారా? అని ముఖ్యమంత్రి జగన్ ను స్టాలిన్ బాబు ప్రశ్నించారు. ఈ అంశంపై భవిష్యత్తులో తాను ఏమి చేస్తాను అనే విషయం తెలుపకుండా చంద్రబాబుని విమర్శించడం సమస్యలకు పరిష్కారం కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గ్రహించాలన్నారు.

ఎస్సీల సంక్షేమం కోసం బడ్జెట్లో ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని, గత ప్రభుత్వ పథకాలు తప్ప వేరే అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయింపులు చేయలేదని ఆయన అన్నారు. ఆయన ప్రాధాన్య అంశాలైన నవరత్నాలకు కేటాయింపులను ఉపప్రణాళికలో చూపించడం దారుణమని, వాటికి జనరల్ స్కీముల నిధులనే కేటాయించవలసినది పోయి సబ్ ప్లాన్ నిధులను కేటాయింపుల్లో చూపించారని అన్నారు. ఉచిత విద్యుత్తును 200 యూనిట్లకు పెంచుతున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం ఇందుకు తగిన కేటాయింపులు చేయలేదన్నారు.ఎస్సీల గృహనిర్మాణాలకు నిధులను పెంచకపోగా 64 వేల 400 ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా చూపించడం దురదృష్టకరమన్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఎంత నిధులు కేటాయిస్తున్నా రో తెలుప లేదని అన్నారు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన దళితులను ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని స్టాలిన్ బాబు విమర్శించారు.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Politics

ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ

Published

on

మార్చి 29 వ తారీఖున ఆంధ్రరాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ప్రకటించడం వల్ల సాధారణ ప్రజలు, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు ఉపాధిని కోల్పోవడం వల్ల, వారందరికీ చేయూత నివ్వడం కోసం ఆంధ్రరాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ప్రతి కుటుంబానికి ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు సరఫరా చేస్తూ తన పెద్ద మనసును చాటుకున్నారు. అందులో భాగంగా గౌరవ పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు ఆదేశానుసారం, రాష్ట్ర వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీ వడిశెట్టి నారాయణ రెడ్డి నాగులాపల్లి సెక్రటేరియట్ స్టాప్ మరియు వలంటీర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ సోషల్ డిస్టెన్స్ పై అవగాహన కల్పిస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఈ ఉచిత రేషన్ సరఫరా సక్రమంగా జరగడానికి గౌరవ శాసనసభ్యులు ప్రయత్నిస్తున్నారు, కావున ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా వైరస్ బారినుండి స్వచ్ఛందంగా తమను తాము కాపాడుకోవాలని శాసనసభ్యులు పెండెం దొరబాబు మరియు వడిశెట్టి నారాయణ రెడ్డి సంయుక్తంగా పిలుపునిచ్చారు…

Continue Reading

Politics

ఉచిత రేషన్ పంపిణీ…

ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం…

Published

on

అమరావతి :

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. మూడు నెలల బడ్జెట్‌కు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురానుంది. జూన్ 30 వరకు అవసరమైన నిధులకు ప్రభుత్వం ఆర్డినెన్స్ పెట్టనుంది. కేబినెట్‌ ఆమోదం అనంతరం ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్రం గవర్నర్‌కు పంపనుంది. మంత్రులంతా సామాజిక దూరం పాటించేలా..ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ సమావేశం జరుగుతోంది.

Continue Reading

Trending

www.vsbnews.in