Connect with us

News

సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ వార్నింగ్‌..?

Published

on

అమరావతి , జూలై 06 , VSB NEWS :

జ‌గ‌న్ సీరియ‌స్ వార్నింగ్‌: బిత్త‌ర‌పోయిన సీనియ‌ర్ మంత్రి: న‌లుగురు జూనియ‌ర్ల‌కు హెచ్చరిక‌..

ఎప్పుడూ న‌వ్వుతూ..అన్నా..అమ్మా అంటూ పిలిచే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఒక్క‌సారిగా సీరియ‌స్ అయ్యారు. కేవినెట్‌లో ఏరి కోరి తెచ్చుకున్న ఆ అయిదుగురికి సీఎం త‌న‌కు ఆగ్ర‌హం తెప్పిస్తే ఎలా ఉంటుందో చూపించారు.

తాము ఏం చేసినా ఎక్క‌డో క్యాంపు కార్యాల‌యంలో కూర్చొనే ముఖ్యంత్రికి ఎలా తెలుస్తుందిలే అనుకున్న మంత్రుల‌కు ఆధారాల‌తో స‌హా ఏం చేసారో వివ‌రించారు.

తాను గ‌తంలోనే చెప్పాన‌ని..ఇప్పుడు హెచ్చ‌రిస్తున్నాన‌ని..మ‌రో సారి ఇదే విధంగా జ‌రిగితే మంత్రులుగా మీరు ఉండ‌రు అని తేల్చి చెప్పేసారు. వారిలో సీనియ‌ర్ మంత్రి జ‌గ‌న్ చెప్పిన స‌మాచారంతో బిత్త‌ర పోయారు. మిగిలిన న‌లుగురు బ‌తికిపోయాం అంటూ బ‌య‌ట‌ప‌డ్డారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింది…

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన రోజే స్ప‌ష్టం చేసారు. ఆరు నెల‌ల నుండి ఏడాది లోగా జ‌గ‌న్ మంచి సీఎం అని అనిపించు కుంటాన‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఇక కేబినెట్ కూర్పులో సీనియ‌ర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టి కొంత‌మందిని ఏరి కోరి త‌న కేబినెట్‌లో అవ‌కాశం ఇచ్చారు.

ఇక‌, తొలి కేబినెట్ స‌మావేశంలో మంత్రుల‌కు సైతం ఇక స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఏ ఒక్క‌రూ అవినీతికి పాల్ప‌డ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసారు. మంత్రులు త‌మ బంధువుల‌..పేషీ సిబ్బంది సైతం ఎక్క‌డా అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

ప్ర‌తీ ఒక్క‌రూ రెండున్నారేళ్లు మంత్రిగా ఉంటాన‌నే ధీమాతో ఉండ‌వ‌ద్ద‌ని..ఎవ‌రైనా అవినీతి పాల్ప‌డిన‌ట్లు తెలిస్తే అదే రోజు చివ‌రి రోజు అవుతుంద‌ని చాలా సీరియ‌స్‌గా చెప్పారు.

అవినీతిని ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించ‌న‌ని తేల్చి చెప్పారు. స‌రిగ్గా కేబినెట్ ఏర్ప‌డి నెల రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు. కానీ, మంత్రుల శైలి ప‌ట్ల సీఎం రియాక్ట్ కావాల్సి వ‌చ్చింది.

జ‌గ‌న్ కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. మంత్రుల ప‌ని తీరు పైన సీఎం ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌మాచారం తెప్పించుకుంటున్నారు. ఇందు కోసం ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ప‌ని చేస్తోంది. కొద్ది రోజులుగా ఏపీలో బ‌దిలీల ప్ర‌క్రియ మొద‌లు అయింది.

న‌లుగురు మంత్రుల పేషీల్లో మంత్రుల బంధువులు..అనుచ‌రుల‌ హ‌డావుడి ఎక్కువ‌గా ఉంది. ఇద్ద‌రు మంత్రుల అనుచ‌రులు నేరుగా పైర‌వీల కోసం త‌మ మంత్రుల ద్వారా ఇత‌ర శాఖల మంత్రుల‌కు సిఫార్సు చేయించి న‌ట్లుగా స‌మాచారం అందింది.

ఇక మ‌హిళా మంత్రి ద‌గ్గ‌రి బంధువు మొత్తం మంత్రికి సంబంధించిన వ్య‌వహారాలు తానే చూసుకుంటానంటూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఉద్యోగులు ప్రాప‌ర్ ఛాన‌ల్ ద్వారా బ‌దిలీల కోసం మంత్రుల దగ్గ‌రికి రావాల్సిన అవ‌స‌రం ఏంట‌ని అధికారుల‌ను సీఎం ప్ర‌శ్నించారు.

ప్ర‌త్యేక కేసుల్లో మిన‌హాయిస్తే ఇంత మంది మంత్రు ల కోసం అసెంబ్లీకి వ‌చ్చే ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌ని ఆరా తీసారు. వారం రోజులుగా స‌చివాల‌యంలో తిరునాళ్ల‌ను త‌ల‌పించేలా జ‌న సందోహం ఉండ‌టం చూస్తే ఎవ‌రికైనా అక్క‌డ జ‌రిగేది ఏంటో అర్ద‌మైపోతుంది.

ఎటువంటి క్లిష్ట స‌మయంలోనూ న‌వ్వుతూ క‌నిపించే సీఎం జ‌గ‌న్ ఈ వ్య‌వ‌హారంలో మాత్రం ఒక్క‌సారిగా సీరియ‌స్ అయ్యారని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్‌లో కీల‌క నిర్ణ‌యాల ద్వారా అవినీతి అధికారుల‌ను త‌ప్పించ‌టం పైన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌ను సీఎం అభినందించారు.

అదే స‌మ‌యంలో రాజ‌ధాని గురించి ఈ మ‌ధ్య కాలంలో అధికంగా ప్ర‌స్తావిస్తున్న ఓ సీనియ‌ర్ నేత‌ను ..అన్నా మీకంటే స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేసే వారు ఉన్నా మీ మీద న‌మ్మ‌కంతో బాధ్య‌త‌లు అప్ప‌గించాను అంటూ ..తాను చెప్ప‌ద‌ల‌చుకుంది చెప్పేసారు.

ఇక, అవినీతి చేస్తున్నారనే విష‌యం త‌న నోటితో చెప్ప‌కుండా..వారి పేషీల్లో ఏ స‌మ‌యంలో ఏం జ‌రిగిందో వివ‌రిస్తూ..ఈ ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని ..లేక‌పోతే ఇక చెప్పాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌ద‌ని జ‌గ‌న్ ఇద్ద‌రు మ‌హిళా..మ‌రో ఇద్ద‌రు జూనియ‌ర్ మంత్రుల‌కు ముఖ్య‌మంత్రి నిర్మొహ‌మాటంగా చెప్పేసారు.

కుటుంబ స‌భ్యుల ప్ర‌మేయం లేకుండా చూసుకోవాల‌ని ఇదే చివ‌రి హెచ్చిర‌క అంటూ ఆ మ‌హిళా మంత్రిని సీఎం హెచ్చ‌రించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇప్పుడు జ‌గ‌న్ త‌న మంత్రుల‌కు ఇచ్చిన వార్నింగ్ పైన స‌చివాల‌యంలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

Continue Reading
Advertisement
1 Comment

1 Comment

  1. చంద్రశేఖర్

    July 7, 2019 at 7:00 am

    Wonderful leader అంటే జగన్ ఒక్కరే…దుర్భిణీ వేసి చూసినా ఈ దేశంలో మరొకరుండరుగాక ఉండరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది….

Published

on

కరోనా వ్యాప్తి కట్టడికి పుల్లలచెరువులో క్షేత్ర స్థాయి అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిషేధిత ప్రాంతంగా ప్రకటించి, రెడ్ జోన్లో ఇంటింటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెళ్లి ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. వయో వృద్దులకు జాగ్రత్తలు తెలియజేసారు.ఎంపిడివో ఆదేశాలమేరకు పంచాయతీ కార్యదర్శి బాలూనాయక్ ఆధ్వర్యంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు. అన్ని వీధుల్లో బ్లీచింగ్ ,సోడియం హైపో క్లోరేట్ పిచికారీ చేయించారు. కరోనా బాధితురాలి ప్రైమరీ కాంటాక్ట్స్ ను 27 మందిని గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. బాధితురాలిని,కుటుంబ సభ్యులను ఐసోలేషన్ కు తరలించారు. అధికారులు, సిబ్బంది ఇక్కడే ఉండి కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. రహదారుల్లో ముళ్ళకంచలు ఏర్పాటు చేశారు. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు. ఎస్సై వెంకటేశ్వరరావు, తహసీల్దార్ అశోక్ రెడ్డి, ఎంపిడివో శ్రీనివాసులు, డాక్టర్ కిరణ్మయి, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. అధికారులు చేపడుతున్న చర్యలతో పుల్లలచెరువులో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. కరోనా కేసు నమోదు కావడంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు.

Continue Reading

News

బఫెట్‌ను వెనక్కి నెట్టేసిన ముఖేశ్…

Published

on

By

న్యూఢిల్లీ :

భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ అరుదైన ఘనత సాధించారు. సంపన్నుల జాబితాలో ఆయన అపర దానకర్ణుడిగా పేరుగాంచిన వారెన్‌ బఫెట్‌ను వెనక్కినెట్టారు.

బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు.

ఆసియా నుంచి టాప్‌-10లో ఉన్న ఒకే ఒక్కరు ముఖేశ్‌ కావడం గమనార్హం.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చాలని కంకణం కట్టుకున్న ముఖేశ్‌ ఆ పనిలో విజయవంతమైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆ సంస్థ విలువ 68.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

బఫెట్‌ సంస్థ బెర్క్‌షైర్‌ హాథ‌వే 67.9 బిలియన్‌ డాలర్లను దాటేసింది.

ఐతే‌ 2.9 బిలియన్‌ డాలర్లను విరాళంగా ఇవ్వడం, సంస్థ పనితీరు కాస్త మందగించడంతో బఫెట్‌ తొమ్మిదో స్థానానికి దిగిపోయారు.

2006లోనూ 37 బిలియన్‌ డాలర్లను విరాళం ఇవ్వడంతో ఆయన ర్యాంకు తగ్గిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగంలో ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ సహా కొన్ని కంపెనీలు 15 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

రిలయన్స్‌ చమురు రిటైల్‌ వ్యాపారంలో బీపీ పీఎల్‌సీ బిలియన్‌ డాలర్ల వాటా కొనుగోలు చేసింది.

మొత్తంగా 2020లో ఎంఅండ్‌ఏ ద్వారా 12శాతానికి పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Continue Reading

News

మందుబాబులు  మద్యం దుకాణాల ముందు బారులు….

Published

on

10 రోజులపాటు లాక్‌డౌన్

 

మహారాష్ట్రలోని పుణెలో జూలై 13 నుంచి 23 వరకూ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. పది రోజుల వరకూ మళ్లీ మద్యం దుకాణాలు తెరిచే అవకాశం లేకపోవడంతో స్టాక్ పెట్టుకోవాలని మద్యం ప్రియులు నిర్ణయించుకున్నారు.

కరోనా కట్టడికోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ముంబై తర్వాత పుణె జిల్లాలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పుణె జిల్లాలో గురువారం ఒక్కరోజే 1,803 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 1,032 కరోనా కేసులు ఒక్క పుణె నగరంలోనే నమోదయిన పరిస్థితి. ఇప్పటివరకూ 978 మంది కరోనా వల్ల మరణించారు. పుణెలో పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. కేవలం అత్యవసరాలకు మాత్రమే అనుమతినిచ్చింది.

Continue Reading

Trending

www.vsbnews.in