Connect with us

News

జర్నలిస్టులందరికి అక్రిడియేషన్ లు ఇవ్వాలి : VSB సురేష్

Published

on

రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికి అక్రిడియేషన్ లు ఇవ్వాలని జి.వో.నం.96 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ లు ఇవ్వాలని, నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం సికింద్రాబాద్ ప్యారడైజ్ పరిధిలో గల లయన్స్ భవన్ నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్,రాష్ట్ర వెబ్ చానల్ అసోసియేషన్ సంయక్తంగా సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. కేవ‌లం దిన‌ప‌త్రిక‌లు, టీవీ ఛాన‌ల్స్ లో ప‌ని చేస్తున్న వారు మాత్ర‌మే జ‌ర్న‌లిస్టులు అనుకోవ‌డం పొర‌పాట‌ని, వెబ్ అండ్ యూ ట్యూబ్ ఛాన‌ల్స్ లో ప‌ని చేస్తున్న మీడియా మిత్రులు కూడా వార్తా సేకరణలో ఎనలేని కృషి చేస్తున్నార‌న్నారు. అంతేకాకుండా ప్ర‌సార‌మాధ్య‌మాల ద్వారా క‌న్నా స‌మాచారాన్ని మ‌రింత వేగ‌వంతంగా సోష‌ల్ మీడియా ద్వారానే చేర‌వేయ‌గ‌లుగుతుంద‌న్నారు.

రాష్ట్ర ప‌భుత్వం కాని ప్ర‌తిఫ‌క్షం కాని త‌ప్పులు చేస్తే వాటిని ఎత్తి చూప‌డ‌మే త‌మ బాధ‌త్య అన్నారు. త‌మ‌కు ఏ ప‌క్షం లేద‌ని, తాము ఏ ప‌క్షానికి వ‌త్తాసు ప‌ల‌క‌మని, ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల‌కు మ‌ద్య‌ ఒక వార‌ధి లా ప‌నిచేస్తున్నామ‌ని స్ఫ‌ష్టం చేశారు. అవినీతిని ఎంగట్ట‌డ‌మే త‌మ బాధ్య‌త అన్నారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం మీడియా మిత్రుల‌కు అక్రిడిటేషన్ తోపాటు హెల్త్ కార్డులు ఇస్తున్న‌ట్టు గానే షోషల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇవ్వాల‌ని ఆయ‌న డిమాడ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి త‌మ‌కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ముఖ్యఅథిది విశ్రాంత జస్టీస్ బి.చంద్ర కుమార్, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. జర్నలిస్టులందరికి న్యాయం జరిగే వరకు పోరాడుతాన‌న్నారు. విశ్రాంత జస్టీస్ బి.చంద్ర కుమార్ మాట్లాడుతూ చ‌ట్ట ప‌రిధికి లోబ‌డి వార్త‌లు రాయాల‌ని సూచించారు. అనంత‌రం రాష్ట్ర కార్యవర్గాన్నిఎన్నుకున్నారు.

నేష‌న‌ల్ వెబ్ ఛాన‌ల్ యూనియ‌న్ :

నేషనల్ కార్యవర్గం :

నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, తెలంగాణా రాష్ట్ర సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ వ్యవస్థాపక , జాతీయ అధ్యక్షులు VSB సురేష్ , వైస్ ప్రెసిడెంట్, సాక్షిత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ బీరం తేజోమూర్తి, నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, V7 న్యూస్ ఛానల్ CEO కృష్ణ మనోహర్ గౌడ్, నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, IBR NOW TV మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ,

రాష్ట్ర కార్యవర్గం :

రాష్ట్ర అధ్యక్షులుగా బండారు రాజేంద్ర ప్రసాద్, ఛీఫ్ వైస్ ప్రెసిడెంట్ గా బ‌న్న ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా పి.శశిధర్, ఏ.ప్రవీణ్, సిహెచ్.రవికుమార్, జాయింట్ సెక్రటరీలు గాటి.అరుణ్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, క్రాంతి రణ దేవ్, జి.రవీందర్, కె.రమిదేవి, వర్కింగ్ వైస్ ప్రెసిడేంట్ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి.శిరీష్, జె.విజయ్ నాయక్, రామకృష్ణ చారి, శ్రీనివాస రావు, పి.బాలకృష్ణ ఎన్నుకున్నారు. పారదర్శకంగా జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారు యూనియ‌న్ కు సంబందించిన‌ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని నేషనల్ క‌మిటీ అధ్యక్షులు సురేష్ కోరారు.రాష్ట్ర అధ్యక్షులుగా బండారు రాజేంద్ర ప్రసాద్, ఛీఫ్ వైస్ ప్రెసిడెంట్ గా బ‌న్న ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా పి.శశిధర్, ఏ.ప్రవీణ్, సిహెచ్.రవికుమార్, జాయింట్ సెక్రటరీలు గాటి.అరుణ్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, క్రాంతి రణ దేవ్, జి.రవీందర్, కె.రమిదేవి, వర్కింగ్ వైస్ ప్రెసిడేంట్ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి.శిరీష్, జె.విజయ్ నాయక్, రామకృష్ణ చారి, శ్రీనివాస రావు, పి.బాలకృష్ణ ఎన్నుకున్నారు. పారదర్శకంగా జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారు యూనియ‌న్ కు సంబందించిన‌ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ వ్యవస్థాపక , జాతీయ అధ్యక్షులు VSB సురేష్ కోరారు.

News

మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపిన చంద్రబాబు

Published

on

 

ఆంధ్రప్రదేశ్  , మే 27 , VSB NEWS :

చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
స్ర్రోలింగ్ పాయింట్స్…

మరణించిన పార్టీ నేతలకు సంతాపం తెలిపిన చంద్రబాబు నాయుడు

కోడెల శివప్రసాద్, డాక్టర్ శివ ప్రసాద్, ఎంవీవీఎస్ మూర్తి, కిడారి సర్వేశ్వర రావు, సివేరి సోమ సహా పలువురి నేతలకు మహానాడు నివాళి

• కోడెల జీవితమంతా పేదలకు సాయం చేశారు
• వైసీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారు

• డాక్టర్ శివ ప్రసాద్, నేను కలిసి చదువుకున్నాం

• చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు

Continue Reading

News

అక్రమ ఇసుకపై ఉక్కపాదం మోపుతామన్న ఎ ఎస్పి

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  కడపజిల్లా , మే 27 , VSB NEWS :

పెండ్లిమర్రి మండలం లో ఇసుకరీచ్ ల పై ఏఎస్పి చక్రవర్తి సమావేశం

అక్రమ ఇసుకపై ఉక్కపాదం మోపుతామన్న ఎ ఎస్పి

దొంగబిల్లులు పై ఇసుక రవాణా చెసినా రీచ్ లకు అనుమతులున్న చోట నుండి తీసుకు వెళ్లాలని అక్రమాలు జరగకుండా వుండాలన్నారు..

అవసరమైతే రిచ్ ఓనర్లపైన, కాంట్రాక్టు ఉద్యోగులపై కుడా చర్యలుతిసుకుంటామని అవినితి జరగకుండా ఉండాలని చెప్పారు….

ఈ కార్యక్రమం లో డియస్పి సూర్యనారయణ సి ఐ వినయ్ కుమార్ అదికారులు పాల్గొన్నారు….

Continue Reading

News

కృష్ణా జిల్లా మంత్రులు పర్యటన

Published

on

 

ఆంధ్రప్రదేశ్ ,  కృష్ణా జిల్లా , మే 27 , VSB NEWS :

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాలి నాని సమావేశం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో కొత్తగా 16ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ఏర్పాటుచేయాలని సంకల్పం…

మచిలీపట్నం R&B అతిధి గృహం లో ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సివిల్ సప్లై మంత్రి కొడాలి నానిలకు స్వాగతం పలికిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని…

ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు పై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జిల్లా కలెక్టర్ ఇంతియజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని..

మచిలీపట్నం రాడార్ కేంద్రం సమీపంలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కు సంబందించిన స్థలం పరిశీలన…..

పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం….

రాష్ట్రము లో ఇక పై ప్రజలకు అందుబాటులోకి రానున్న వైస్సార్ విలెజ్ క్లినిక్ లు..

రాష్ట్రము లో ప్రతి 2వేల జనాభాను ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ పరిస్థితులకు అనుగుణంగా విలెజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన…

గ్రామ, వార్డ్, సచివాలయాలలో ఇకపై ప్రాధమిక వైద్యం అందుబాటులోలో తెస్తున్నాం..

ప్రతి రోగికి ప్రాధమిక వైద్యం అందాలని ప్రభుత్వం ఉద్దేశ్యం.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే తక్షణమే ఉచితంగా వైద్యం అందించడానికి విలెజ్ క్లినిక్ లు ఉపయోగ పడతాయి….

రాష్ట్రము లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భోధన హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా పేదలకు స్పెషలిటీ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఆశయం..

అన్ని భోధన హాస్పిటల్స్ లో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తాము..

ప్రతి టీచింగ్ హాస్పిటల్ లో డెంటల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తాం…

జులై 8న రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ వైస్సార్ చిరునవ్వు..కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం…

రాష్ట్రము లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా దంతవైద్యం అందిస్తాము…

Continue Reading

Trending

www.vsbnews.in