Connect with us

CRIME

కాకినాడ ఔషధ తనిఖీ అధికారులు ఎక్కడ..?

Published

on

  • నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు..
  • డాక్టర్ చీటి లేకుండానే విక్రయాలు
  • ఫార్మాసిస్టుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులచే విక్రయాలు..
  • నెలకు వేలల్లో వసూళ్లు

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వి ఎస్ బి న్యూస్:-తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిధిలోగల మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నడుస్తున్నాయి. ఈ విషయాల న్నీ సంబంధిత అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డాక్ట ర్ చీటి రాసిచ్చిన మందులనే ఇవ్వాలని, అది కూడా సంబంధిత డాక్టర్ అందరికీ అర్థమయ్యేలా ఆ మందుల వివరాలను చీటిలో రాయాలని కోర్టులు సైతం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఎక్కడా కూడా నిబంధనలు అమలు కావడం లేదు. మెడికల్ షాపులతో కమీషన్లపై ఆధారపడిన కొందరు వైద్యులు ఎక్కవ ధరలతో ఉన్న కంపెనీల మందులను వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రోగులు ఆ మందులను కొనగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ షాపులలో అనేక కంపెనీలు మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీటిపై జిఎస్‌టి లేక పోయినప్పటికీ వివిధ కంపెనీలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మెడికల్ ఏజెన్సీల ద్వారా మెడికల్ షాపులకు విక్రయిస్తున్నారు. ఏ మందులోనైనా సగానికి సగం లాభం ఉండంతో విచ్చల విడిగా మెడికల్ షాపులు పుట్టుకొస్తులన్నాయి.వాస్తవానికి మెడికల్ షాపు నిర్వహించుకోవాలంటే ఫార్మసి పూర్తి చేసుకున్న వారు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ షాపులో యూనిఫాంతో సంబందిత ఫార్మాసిస్టే మందులను రోగులకు ఇవాల్సి ఉంటుంది. డాక్టర్ తన చేతి ద్వారా రాసిచ్చిన మందులనే ఇవ్వాలని అనేక నిబంధనలు ఉన్నాయి. కాని ఎక్కడ కూడా నిబంధనలు అమలు కావడం లేదు.

అనేక మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు కాకుండా పదవ తరగతి చదవిన వారు సైతం మెడికల్ షాపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అసలు అనుమతులు లేని మెడికల్ షాపు లు ఎన్నో ఉన్నాయి. వైద్యులు రాసిన మందుల చీటీలు లేకుండానే మందుల విక్రయాలు చేపడుతున్నారు. మెడికల్ షాపుల నిర్వహణపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పరిశీలించి తేడాలు వస్తే కేసులు నమోదు చేయా ల్సి ఉంటుంది. అలా చేయడంలో ఆ శాఖ అధికారులు విఫలమవుతున్నారు గడువు తేది అయిపోయినా ఇంకా ఆ మందులను విక్రయించినా, శాంపిల్స్ విక్రయిస్తున్నా చర్యలు తీసుకోవడంలేదు. మందులు విక్రయాలపై ఎప్పటికప్పడు బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఎక్కడా ఎలాంటి నిబంధనలు అమలు కావడం లేదు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలోనే పుట్టగొడుగుల్లా మెడికల్ షాపులు ఎన్నో ఉన్నాయి. కాని వాటిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.ఏ మెడికల్ షాపుల్లో చూసినా ఎలాంటి ఫార్మసిస్టు లేకుండానే విక్రయాలు జరుగుతుంటాయి

దీనిపై ప్రజలను వివరణ కోరగా ఏ ఒక్క మెడికల్ షాపులోను ఫార్మసిస్ట్ ఉండరు సార్..ఎక్సఫైరీ మందులు ఇచ్చేస్తారు.ఒక వ్యాధి మందు అడిగితే ఇంకో వ్యాధి మందు ఇస్తారు ఇదేం కర్మ సార్..డబ్బులు ఇస్తే ఏ మందులైన ఇచ్చేస్తారు డాక్టర్ చీటి లేకుండా..పట్టించుకోవాలిసిన అధికారులు ఎమ్ చేస్తున్నారో తెలియడం లేదు..ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు, డిమాండ్ చేస్తున్నారు..

Continue Reading
Advertisement
1 Comment

1 Comment

  1. gopal

    June 20, 2019 at 10:35 am

    రాజమండ్రిలో ఔషద అధికారుల దర్శనం కోసం గత మూడేళ్ళుగా ప్రయత్నిస్తున్నాము…సార్..???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CRIME

భయంతో ఘోరం….

Published

on

  1. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల కరోనా భయం ఘోర విషాధానికి కారణమైంది..

కొవిడ్ అనుమానంతో 19 ఏళ్ల ఓ యువతిని బస్సులో నుంచి నిర్ధాక్షిణ్యంగా తోసేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో నుంచి తోసేయడానికి ముందు ఆ అమ్మాయి తనకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా ఏ ఒక్కరి హృదయం కరగలేదు. ఆ భయంకర ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బాధితురాలి తల్లి.. ఆ ఘోరాన్ని తలచుకొని గుండెలవిసేలా రోదిస్తోంది.

యూపీకి చెందిన అన్షిక యాదవ్ (19) జూన్ 15న తన తల్లితో కలిసి ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయల్దేరింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. వాళ్లు యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా శికోహాబాద్ చేరాల్సి ఉంది. అయితే.. బస్సు బయల్దేరిన కాసేపటికే యువతికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా కొంత మంది అనుమానించారు. బస్సులో నుంచి దింపేయాలని డ్రైవర్, కండక్టర్‌ను కోరారు.

తనకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని అన్షిక, ఆమె తల్లి మొర పెట్టుకున్నా ఏ ఒక్కరి మనసు కరగలేదు.
ఇతర ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ యువతిని బలవంతంగా కిందకి దింపే ప్రయత్నం చేశారు. అన్షిక ప్రతిఘటించడంతో కిందకు తోసేశారు. రోడ్డుపై పడిపోయిన యువతి అరగంట తర్వాత ప్రాణాలు విడిచింది. ఢిల్లీ-యూపీ యమునా ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

Continue Reading

CRIME

ఏపీలో భారీగా కరోనా కేసులు….

Published

on

ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ , జూలై , 11 VSB NEWS : భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,813 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1,775 ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,235కి చేరింది.
ఇందులో యాక్టివ్ కేసులు 12,533 ఉండగా, 14,393 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 17 మంది కరోనాతో చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 309కి చేరింది.

Continue Reading

CRIME

కరోనా కి బలైన జానపద గాయకుడు…..

Published

on

తెలంగాణ ప్రజానాట్యమండలి నాయకులు జానపద గాయకుడు,కళాకారుడు, సిపిఐ హైదరాబాద్ జిల్లా మాజీ కార్యవర్గ సభ్యులు కా!! నిసర్  కరోన మహమ్మారి సోకి మరణించారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి గారు మరియు cpi హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇటీ. నరసింహ గారు ,Cpi హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డమీది హరినాథ్ గౌడ్ హిమాయత్ నగర్ సిపిఐ నగర కార్యలయం వద్ద పూలమాల వేసి నివాళీ అర్పించడం జరిగింది.

Continue Reading

Trending

www.vsbnews.in