Connect with us

DEVOTIONAL

రత్నగిరి కొండ పై ఘనంగా సీతారాముల కల్యాణ వేడుక…

Published

on

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామ పరిధిలో రత్నగిరిపై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. చైత్ర శుద్ధ అష్టమి శనివారం కళ్యాణ మహోత్సవ వేడుకలలో భాగంగా రెండోరోజు సత్య దేవుని వార్షిక కల్యాణ వేదికను పలు రకాల పుష్పాలతో సుందర మనోహరంగా అలంకరించారు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల సమక్షంలో నూతన వధూవరులైన శ్రీ సీతారామచంద్రులను అర్చక వేదపండితులు ఆశీస్సులు గావించారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు కొండవీటి సత్యనారాయణ, కళ్యాణ బ్రహ్మ, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వివాహ సాంప్రదాయాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నూతన వధూవరులకు దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలను ఈ.వో ఎం. వి సురేష్ బాబు దంపతులు అందజేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం తిలకించడానికి వచ్చిన భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. అంతకుముందు కొండ దిగువున శ్రీ సీతారాములు వారిని పురవీధుల మీదుగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీ ఈరంకి జగన్నాథం, ట్రస్టీలు యనమల రాజేష్, కొత్త వెంకటేశ్వరరావు, సతి దేవదాన రెడ్డి, మట్టి సత్య ప్రసాద్, రావిపాటి సత్యనారాయణ లతోపాటు ఆయా విభాగాల ఏ ఈ వో లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Continue Reading
Advertisement
2 Comments

2 Comments

 1. stream game of thrones online free

  April 15, 2019 at 6:14 pm

  It’s very simple to find out any matter on web as compared to
  textbooks, as I found this article at this website.

 2. watch free

  April 15, 2019 at 8:46 pm

  Wow, that’s what I was seeking for, what a data! present here at this weblog, thanks admin of this site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

DEVOTIONAL

తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాల

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  తిరుమల, ఏప్రిల్ 04 , VSB NEWS :

 

రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.

వసంతోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

ఆంక్షల నేపథ్యంలో వసంత మండపంలో కాక ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

Continue Reading

DEVOTIONAL

ఈ రోజు పంచాంగం…

Published

on

ఆంధ్రప్రదేశ్ ,  అమరావతి , ఏప్రిల్ 04 , VSB NEWS :

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,

తేదీ … 04 – 04 – 2020,
వారం … స్థిరవాసరే 【 శనివారం 】
శ్రీ శార్వరి నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,
తిధి : ఏకాదశి సా5.55
తదుపరి ద్వాదశి,
నక్షత్రం : ఆశ్లేష మ12.50
తదుపరి మఖ,
యోగం : ధృతి ఉ6.12
తదుపరి శూలం తె3.34,
కరణం : వణిజ ఉ6.47
తదుపరి భద్ర/విష్ఠి సా5.55
ఆ తదుపరి బవ తె4.55,

వర్జ్యం : రా12.13 – 1.44,
దుర్ముహూర్తం : ఉ5.57 – 7.34,
అమృతకాలం : ఉ11.17 – 12.50,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండం. : మ1.30 – 3.00,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 5.58,
సూర్యాస్తమయం : 6.09,

Continue Reading

DEVOTIONAL

నక్షత్రం-గుణగణాలు, ఫలితాలు

Published

on

ఆంధ్రప్రదేశ్ , అమరావతి, ఏప్రిల్ 03, VSB NEWS :

 

 

హిణి నక్షత్రం-గుణగణాలు, ఫలితాలు

రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. మానవ గణము కనుక ధర్మచింతన కలిగి ఉంటుంది. జీవితంలో లౌక్యంగానూ ప్రవర్తిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలంటే ఇష్టపడతారు. అందులోనూ ప్రావీణ్యత, గుర్తింపు సాధిస్తారు.

రోహిణి నక్షత్రం 4 పాదాలూ వృషభ రాశిలోనే ఉంటాయి.

రోహిణి మొదటి పాదము
రోహిణి మొదటి పాదములో జన్మించిన వారి ప్రధాన బలహీనత అనవసర విషయాలపై దృష్టిపెట్టడం. అవసరం లేని ఇతర విషయాల మీదే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచన అంతగా లేకుండానే తొందరపడి పనులు మొదలుపెడతారు. దీనివల్ల ఇబ్బందుల్లో కూరుకుపోతారు. నిదానంగా ప్రవర్తించాల్సిన విషయాల్లో జాగరూకత అవసరం. ఇతర విషయాలవైపు మనసు లాగితే చేసే పనిమీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, అనవసర విషయాలకు ప్రాధాన్యం తగ్గించాలి. పరిస్థితుల్ని బట్టి సర్దుకోగలగడం ఒక వరం అనుకోవాలి. సానుకూలతను బట్టి మెలగాలి.

రోహిణి మొదటి పాదము గ్రహ దశలు
ఈ నక్షత్రంలో జన్మించిన వారి గ్రహ దశల విషయానికి వస్తే.. ముందుగా చంద్ర మహర్దశ పదేళ్లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.

రోహిణి రెండో పాదము
రోహిణి రెండో పాదములో జన్మించిన వారు అదృష్ట జాతకులు. కలిసివచ్చిన అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకునే నేర్పు ఉంటుంది. ఈ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మాటల్లో పటుత్వం కలిగి ఉంటారు. ఈ ధోరణితో నెగ్గుకొని రాగలుగుతారు. ఇక జీవితంలో తరచూ తారసపడే అనవసరమైన విషయాల మీద ఆందోళన తగ్గించుకోవాలి. ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనే విషయంలో స్పష్టత సాధిస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

రోహిణి రెండో పాదములో గ్రహ దశలు
ఈ పాదములో జన్మించిన వారికి ముందుగా చంద్ర మహర్దశ ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.

రోహిణి మూడో పాదం
రోహిణి మూడో పాదంలో జన్మించిన వారికి రకరకాల ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. అయితే ఆ ఆలోచనలు బయటపెట్టకుండా జాగ్రత్త పడతారు. కళలయందు ఆసక్తి ఉంటుంది. కొంచెం పట్టు ఉన్నా ఎక్కువ పట్టు ఉన్నట్లు చూపగల నేర్పు ఉంటుంది. అయితే ఎల్లప్పుడు అనవసరపు ఆందోళనలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. భావోద్వేగాలను ప్రకటించే విషయంలో పరిమితి తప్పనిసరి.

గ్రహ దశలు
తొలుత చంద్ర మహర్దశ 5 సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.

రోహిణి నాలుగో పాదం
రోహిణి నాలుగో పాదంలో జన్మించిన వారు అంది వచ్చిన అవకాశాల్ని పసిగడుతారు. జాగరూకులై ప్రవర్తించడం వీరి సహజసిద్ధ లక్షణం. జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం. అటువంటి సందర్భాల్లో సైతం మెరుగైన అవకాశాలకోసం అన్వేషిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు.

గ్రహ దశలు
తొలుత చంద్ర మహర్దశ రెండున్నర సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16

రాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరా లు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.
రోహిణి నక్షత్రము గుణగణాలు
ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. త్వరగా కోపం రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారం కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధిమ్చి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు.

Continue Reading

Trending

www.vsbnews.in