ఘనంగా 54 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు…

కోరుకొండ , నవంబర్ 17 :

ఆజాది కా అమృత్ మహోత్సవ్ల వేడుకలలో భాగంగా 17-11-2021 తారీకు బుధవారం రోజున కోరుకొండ శాఖా గ్రంథాలయములో భారతస్వాతంత్య్రోద్యమం గురించి కవి సమ్మేళనం జరిగింది. ఆనంతరం భారత స్వాతంత్ర్య పోరాట యోధులపై క్విజ్ పోటీలునిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా , రిటైర్డు కో- ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అకౌంటెంట్ శ్రీఎమ్.వి.వి దీక్షితులుహాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని, చక్కని పరిజ్ఞానం సంపాదించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సోషల్ టీచర్ ఎ. రామారావు పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు.ఈల కార్యక్రమంలో కోరుకొండ హైల స్కూల్ డ్రాయింగ్ టీచర్ఎమ్.జూలి ఈనాడు మాజీ విలేఖరి కె.అచ్చయ్య దొర గ్రామపెద్దలు గాదరాడ, శ్రీరంగపట్నం పుస్తక నిక్షిప్త కేంద్ర నిర్వాహకులు కందికట్ల ఆనంద కుమార్, బొడ్డేటి శ్రీనివాస్, విద్యార్థిని విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published.

Start typing and press Enter to search