జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సర్వే : ఎంపీడీవో పి.ఎస్.నరేష్ కుమార్

కోరుకొండ , అక్టోబర్ 28 :

కోరుకొండ మండలంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని, వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఆయా లబ్ధిదారులను గుర్తించడానికి సర్వే నిర్వహిస్తున్నామని కోరుకొండ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పి. ఎస్.నరేష్ కుమార్ పేర్కొన్నారు. గతంలో లో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా హౌసింగ్ లోన్ తీసుకొని లోన్ ద్వారా కట్టుకున్న లబ్ధిదారుల, బకాయిలను హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారాఆ ఇళ్లకు గృహహక్కు కల్పించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేయనుందని తెలిపారు. మండలంలో 9,214 మంది లబ్ధిదారులు ఉన్నారని, జిల్లాలో సుమారు ఐదు లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారని, ఈ జగనన్న సంపూర్ణ గృహకల్ప పథకం ద్వారా వారికి పూర్తి హక్కుకలుగుతుందన్నారు. అలాగే గృహానికిసంబంధించిన వ్యక్తి, లేకపోతే ఆయనకు సంబంధించిన లీగల్ ఏర్ ఉన్నట్లయితే ఆ కుటుంబానికి 10 వేలు, కొట్టుకోవచ్చని, అలాగే లబ్ధిదారుల నుండి కొనుగోలు చేసుకున్న వ్యక్తులు ప్రస్తుతం ఆ ఇళ్లలో ఉన్నట్లయితే వారు 20 వేల చొప్పున బకాయిలు చెల్లించాలని తెలిపారు. దాంతో పూర్తి హక్కు ఆ గృహానికికలుగుతుందన్నారు. ఈ బకాయిలు కట్టించుకునేందుకు ఆయా ఏరియాకు సంబంధించిన వాలంటీర్లకు ట్యాగ్ చేయడం జరిగిందన్నారు. దీనిపై నవంబర్ నెలఖరుకి సర్వే నిర్వహించి,డేటానుజిల్లాఉన్నతాధికారులకు సమర్పించాలి తెలిపారు. అలాగే అవుట్ రీచ్ క్యాంపు ద్వారా, ప్రతీ నెలాఖరు శుక్ర, శని, వారాలలో గ్రామ సచివాలయ ఉద్యోగులు అందరూ ఆయా గ్రామాల్లోని ప్రజల గృహాల వద్దకు వెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు, సరిగ్గాఅందుతున్నాయా.. లేదా.. ఏ కారణం చేత అందడంలేదని, అందక పోవడానికి కారణాలు ఏమిటని, లబ్ధిదారులతో ముఖా ముఖి మాట్లాడి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా సిబ్బంది చర్యలు తీసుకోవాలని, ఒక ప్రత్యేక కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీవో నరేష్ కుమార్ వివరించారు.

Leave a Comment

Your email address will not be published.

Start typing and press Enter to search