వరిపంటలోబాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణ : ఏ.డి.ఏ. మల్లికార్జునరావు

కోరుకొండ , అక్టోబరు 20 :

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, సీతానగరం, రాజానగరం, గోకవరం, మండలాలలో వరి పంటలో అంకురం ఏర్పడే దశలో రైతులు మెలుకువలు తెలుసుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకులు బి.కే. మల్లికార్జునరావు తెలిపారు. బుధవారం కోరుకొండ మండలంలో పలు గ్రామాల్లో ఏరువాక కేంద్రంసమన్వయకర్త సీనియర్ సైంటిస్ట్ ఎ. సీతారామశర్మ, పలువురుసైంటిస్టులు, ఏరువాక కార్యక్రమంలో భాగంగా చీడపీడలకు గురైన వరిపంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణంలో 30 డిగ్రీలుష్ణోగ్రత, అంతకన్నా తక్కువ ఉండి, మంచుతోను, వర్షం పడినప్పుడు, గాలివానలకు, బాక్టీరియా వరి ఆకుఎండుతెగులును ఆశించడానికిఅనుకూల పరిస్థితులని అన్నారు. అలాంటి సమయాల్లో వాతావరణంలో ఆకు కు పట్టిన ఎండు తెగులు బాగా అభివృద్ధి చెంది వ్యాపిస్తుందని రైతు సోదరులుఅప్రమత్తమైవ్యాధి సోకకుండా దిగువ తెలిపిన నివారణ చర్యలు పాటించాలని కోరారు. బాక్టీరియా ఆకులోపల భాగం ప్రవేశించడం వలన ఆకు అంచుల నుండి పసుపురంగు నీటి డాగుమచ్చలు, ఏర్పడి ఆకుఎండి పోతుందని అన్నారు. తెగులు నివారణకు నత్రజని 3-4సార్లు వేయడం చేయాలన్నారు. తెగులు 5 శాతం కన్నా ఎక్కువ అయితే ప్రజెంట్ నత్రజని వేయడం తాత్కాలికంగా నిలిపివేయాన్నారు. తెగులు ఆశించిన పొలంలో నీటిని కో రోజులు ఉండకుండా మురుగు నీటిని బయటకు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పొటాష్ ఎరువులను అంకురం ఏర్పడే దశలో15-20 వాడాలనే రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి ఎ.గౌరీ, శాస్త్రవేత్తలు,రైతులు, పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published.

Start typing and press Enter to search