రజకులను ఎస్సీ జాబితాలోచేర్చాలి…

కోరుకొండ , అక్టోబర్ 20 :

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని జిల్లా రజక సంఘం అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు అన్నారు. రజక సంఘ సమావేశంలో మంగళవారం ఆయనముఖ్యఅతిథిగాపాల్గొనిమాట్లాడుతూ గతచంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రజకుల యొక్క ఆలోచనలు గాని,రజకులవిధానాలుగానీ, రజకుల సమస్యలు తీర్చేవిధంగా పరిగణలోకితీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రజకుల యొక్క సమస్యలనుగుర్తించి, తమకుఒక రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, జిల్లా కార్పోరేషన్ కి12మంది డైరెక్టర్లుగా,ఒక చైర్మన్ నిఎంపిక చేసి వారి ద్వారా గ్రామాలలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తెచ్చుకుని సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తున్నారని,వారికి తమ రజక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు. అలాగే రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జక్కంపూడి రాజా రజకుల సమస్యలను వారి ఇబ్బందులను గుర్తించే తాము కోరుకున్న విధంగా కోరుకొండ మండలం పట్నం గ్రామంలో రజకుల కమ్యూనిటీ హాల్నిర్మించుకునేందుకు 500 గజాలు కలిగిన స్థలాన్ని తమ సంఘానికి ఇప్పించారని వారికి తమ సంఘం తరపునుండి రుణపడి ఉంటామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రజకులు అంతాఒకేతాటి పై నడుస్తున్న తరుణంలో, గత ప్రభుత్వంలో తమ సంఘాలలోపనిచేసిన కొంతమందిఇప్పుడు రజకుల సంఘటితను,విచ్చిన్నం చేసేందుకు కృషి చేస్తున్నారని,అలా జరిగితే ఉపేక్షించేది లేదని,కొండపల్లి దుర్గారావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నిన్నకాక మొన్న వచ్చి సమావేశాలు పెడుతూ సమస్యలు ఏమైనా ఉంటే నా వద్దకు రండి నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి రజకులను తప్పుదోవ పట్టిస్తున్నారని,గంధం రవికుమార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గ స్థాయిలో గ్రామాలు మండలాల వారీగా కమిటీలు నిర్వహణ జరుగుతుందని గ్రామాల్లోనే రజకులు సమాయత్తం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో రామచంద్రాపురంఎ. ఎమ్.సి.వైస్ చైర్మన్ కాకతీయ రాజు, ఉపాధ్యక్షులు తాటిపాక రాంబాబు రామచంద్రపురం కార్పొరేటర్ కోటిపల్లి శివాజీ, శంకారపు గంగారత్నం, శంకరపు సాదుబాబు,బుడంపర్తి రాము, గొల్లపల్లి బాపిరాజు, మల్లంపల్లి వెంకన్న, కొండపల్లి నాగేశ్వరరావు,కమిడి సోమరాజు,దాసుపల్లి సూర్యనారాయణ వివిధ గ్రామాల రజక నాయకులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published.

Start typing and press Enter to search