బాధ్యతారాహిత్యమా.??? “ఇష్టా”రాజ్యమా..???

*దొరికినా సరే “దొర”లే…
*బాధ్యతారాహిత్యమా.???. “ఇష్టా”రాజ్యమా..???
హిస్టరీలో మిస్టరీ చేతివాటంలో వాటాలు.. అంతుచిక్కని రహస్యాలు..కోటదాటనివ్వరు..పేటలోకి రావాలంటే పీటముడి విప్పరు.. పారదర్శకతకు జవాబుదారీకి అడుగడుగునా గజాల లోతున సమాధి చేసే అత్యం జాలి దయ కలిగిన అపసవ్య అధోగతి వ్యవస్ధకు నిలువెత్తు సజీవ సాక్ష్యం ఈ చోరీల వ్యవస్ద.. ప్రజాధనం పోయిందనే బాధ ఉండదు. బాధితుల ఆవేదనకు కన్నీళ్ళకు చలించే గుణం ఉండదు.. ప్రజల సొమ్ము దోచుకునే వారి దాచుకునేవారి యోగ క్షేమాలకే ప్రాధాన్యం.. ఇదే విధి విధానం.. అయింది.. అయిపోయింది.. తిరిగి రాదుగా అని మిట్ట వేదాంతం జోడించి..లాలించి.. బుజ్జగించి చేతివాటాదారులంతా ఏకతాటి పై వచ్చి ప్రజల నెత్తిన కుచ్చు టోపీ పెట్టే కాలయాపన చేసే చట్ట వ్యతిరేక వ్యవస్దకు ఊపిరులూదే ప్రబుద్దుల కార్ఖానా ఇది.. అందుకే నిందితులు అపరకుబేరులుగా బాధితులు దారిద్ర్యరేఖకు దిగువగా చేరిపోతున్నారు.. జననమరణ దృవీకరణ పత్రాల జారీ నుంచి , ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్ధలాల పన్నులు, రోడ్లు, డ్రైన్లు, సులభాకాంప్లెక్సులు ఇలా చెప్పుకుంటూ వెడితే ప్రతి లావాదేవీలోనూ సామాన్యులు బాధితులుగా మిగిలిపోతున్నారు. ఈ నాటిదికాదు.. సదరు యంత్రాగం తీసుకునే రక్షణ చర్యలు..రక్షణ తంత్రాలు అన్నీ కూడా బాదితులకు బద్ద శత్రువులుగానే ఉంటాయనేది.. హిస్టరీలో మిష్టరీలే… ప్రభుత్వాలు మారినా పాలకులు పదే పదే సామాన్యుడికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్దాయిలో ఎలాంటి మార్పు లేకుండా తీర్పులు ఇచ్చే కొందరి నియంతృత్వ పోకడలు ఏళ్ళతరబడి పాతుకుపోయాయి.. అదేమిటని ప్రశ్నిస్తే ఇక ఎప్పటికీ సమస్య పరిష్కారం కాదు..
నాటి కంప్యూటర్ అదృశ్యం .. అంతకు ముందు కుళాయి పన్నుల వసూళ్ళకు సంబందించిన అంశం, ఆ తరువాత మూడు పాలక వర్గాల కౌన్సిల్ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు ..ప్రత్యారోపణలు పై ఇంతవరకూ ఒక్క సంస్కర్ణలేదు.. చర్యలు లేవు..
సుమారు 40 రోజులు దాటిపోయింది..
=================================
**2021 వ సంవత్సరం ఆగస్టు నెల 31 వ తేదీ మద్యాహ్నం 12 గంటలు సమయం దాటినప్పటి నుంచి నగరపాలక సంస్ధ కార్యాలయంలో వాతావరణం మారిపోయింది.. ఒకింత ఆందోళనకు గురయ్యారు.. సొమ్ములు పోయినాయనే సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.. పోలీసులు అధికారులకు పిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమయింది.. క్లూస్ టీమ్…జాగీలం రాక ఇలా అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.. విషయం బయిటకు తెలిసిపోయింది.. నగరపాలక సంస్ధ కార్యాలయం గేట్లు మూతపడ్డాయి.. లోపలకు ఎవరినీ అనుమతించడం లేదు..లోపల ఉన్నవారిని బయిటకు వెళ్ళనీయడం లేదు.. అర్దరాత్రి వరకూ కూడా లాకర్ కోసం వెదుకుతూనే ఉన్నారు.
ఆ రోజుకు సమాచారం ఇదిగో ఇలా ఉంది..
ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి నగరపాలక సంస్ధ కార్యాలయం పూర్తి స్దాయి భద్రతకు ప్రతిరూపం..అన్ని ఆధునిక సౌకర్యాలతో సహా అదునాతనమైన పటిష్టమైన సిసి కెమెరా నిఘా వ్యవస్ధ కూడా ఉంది.. అంతకు మించి 24 గంటలకు పహారా కాస్తూ ఉండే రక్షణ వ్యవస్ధ కూడా నెలకొల్పారు. అపరిచితులు కానీ…తెలియని వారు కానీ లోపలకు వెళ్ళే అవకాశం అసలు లేదు. కార్యాలయం పని వేళల్లో మాత్రమే లోపలకు వెళ్ళే అనుమని ఉంటుంది.. కార్యలయం పని వేళ కంటే పావు గంట ముందు లోపలకు వెళ్ళాలంటే అక్కడ సిబ్బంది వెళ్ళనీయరు.. అంత నిబద్దతతో విదులు నిర్వర్తిస్తూ పహారా కాస్తూ ఉంటారు.
* అలాంటి చోట చోరీ జరిగింది.. ఏదో చిన్న దొంగతనం.. ఎవరూ చూడకుండా నాలుగు కాగితాలు జేబులో పెట్టుకుని పెళ్ళిపోయారు అనే దొంగతనం కాదు…
*ట్రజరీ రూమ్ లో స్ర్టాంగ్ లాకర్ ను తలపించే సేఫ్ లాకర్… సుమారు 20 కెజీలు పైగా బరువు ఉండేది అదృశ్యమయింది..
* ఆస్తి పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే సొమ్మును నగరపాలక సంస్ద ట్రజరీ స్ర్టాంగ్ రూమ్ లో తోలుత భద్రపరిచి తరువాత బ్యాంకులో జమచేస్తారు.. ఇటీవల ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మే చోరీకి గురయిందని తెలిసింది..
* నాలుగు అయిదు దారులు అంటూ ఏమీ లేవు.. ఇంచు మించు నగర పాలక సంస్ధ కార్యాలయం ఆవరణలోనే సరిహద్దులుగా ఒక వైపున విద్యుత్ కార్యాలయం ..మరో వైపున పోలీసు స్టేషన్ కూడా ఉంటాయి..
* అదివారం, సోమవారం వరుసగా శెలవులు వచ్చాయి. మంగళవారం కార్యాలయానికి సదరు సిబ్బంది వచ్చిన తరువాత కానీ చోరీ జరిగిందని తెలియదు.. ఈ నెల 27, 28 తేదీలలో ప్రజలు చెల్లించిన సొమ్ములు సుమారు 10 లక్షల 11 వేల రూపాయలు మినీ సేఫ్ లాకర్ లో ఉంచారు..
*నగరపాలక సంస్ధ అధికారులు సమాచారాన్ని పోలీసులకు దృష్టికి తీసుకు వెళ్ళారు.. యుద్దప్రాతిపదిక పై పోలీసు అధికారులు రంగంలోకి దిగారు.. హుటాహుటిన సంఘటనా స్దలానికి చేరుకున్నారు.. క్లూస్ టీమ్ … డాగ్ స్క్వాడ్… వచ్చింది.. దర్యాప్తు ప్రారంభం అయింది…పోలీసు జాగిలం పరిసర ప్రాంతాలలోనే సంచరించింది.. నగరపాలక సంస్ద ఆవరణ దాటి బయటకు వెళ్ళలేదని తెలిసింది.. నిందితులు కూడా చాలా తెలివిగా వ్యవహరించారు. పరిసరాలలో కారం చల్లారని దర్యాప్తులో తెలిసింది.. బయిట చోరుల పనా.. ఇంటి చోరుల పనా అనే సందేహాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది…
* సిసి కెమెరా వ్యవస్ధ పనిచేయక పోవడంలో ఆంతర్యం ఏమిటో అన్నది అంతుచిక్కని మిస్టరీగా మారింది..
నగర పాలక సంస్దలో సుమారు 42 సిసి కమెరాలు ఉన్నాయి… వాటిలో 17 కమెరాలు పనిచేయడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం..
* నగదు భద్రపరిచే స్ర్టాంగ్ రూమ్ కూడా చెత్తాచెదారంతో అపరి శుభ్రంగా ఉంటుం పలువురు చెబుతున్నారు. గతంలో ఇదే స్ర్టాంగ్ రూమ్ లో కోటి రూపాయలు వరకూ భద్రపరిచిన సందర్బాలు ఉన్నాయి.. స్ర్టాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలలో నిఘాభద్రతా కొరవడానికి నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వినవస్తున్నాయి.. మంగళవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది యధావిధిగా విధులలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం బ్యాంకులో సొమ్మును జమచేయడానికి మినిసేఫ్ లాకర్ రూమ్ వద్దకు వెళ్ళి చూసే సరికి తాళాలు పగలు గొట్టి ఉన్నాయి.. సిబ్బంది లోపలకు వెళ్ళి చూడగా లాకర్ మాయం అయిందని గుర్తించారు.. మంగళవారం మధ్యాహ్నం వరకూ చోరీ జరిగిన విషయం గుర్తించలేక పోయారంటే స్ర్టాంగ్ రూమ్ నిర్వహణలో అజాగ్రత్త ఉందని తెలుస్తోంది..
* నగరపాలక సంస్ధ కార్యాలయంలో స్ర్టాంగ్ రూమ్ లోకి అపరి చితులు వచ్చి చోరీ చేసే సాహసం చేశారంటే నిజంగా భద్రతా వ్యవస్ధకు గొడ్డలి పెట్టుగా ఉందని చర్చనీయాంశంగా మారింది..
* డిఎస్ పి సంతోష్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం అయింది.. వేలిముద్రలు నిపుణులు వేలిముద్రలు సేకరించి వాటిని పరిశీలిస్తున్నారు.
* అర్దరాత్రి దాటే వరకూ విచారణ చేస్తూనే ఉన్నారు.
తేదీ మారిపోయింది.. బుధవారం వచ్చేసింది…ఎట్టకేలకు బుధవారం సాయంత్రానికి అంటే పిర్యాదు స్వీకరించిన 24 గంటల్లోనే పోలీసుల కృషి ఫలించింది.. నగరపాలక సంస్ధ పాతభవనం పరిసర ప్రాంతాలలో మినీ సేఫ్ లాకర్ ను గుర్తించారు.. చెత్తా చెదారం పనికిరాని వస్తువులు, ప్లెక్సీలు ఉండే ప్రాంతంలో మినీ సేప్ లాకర్ కనిపించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.. సెప్టెంబరు ఒకటో తేదీన లాకర్ ను గుర్తించి దానిని తెరిచి చూశారు.. నగదు పూర్తిగా లేదని కూడా పత్రికలలో వార్తాకధనాలు వచ్చాయి.. అధికారకంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.. కేసు విచారణలో ఉన్నది సమాధానం వచ్చింది.. రోజులు గడుస్తున్నాయి.. సెప్టెంబర్ నెల వెళ్ళిపోయింది.. అక్టోబర్ నెల వచ్చేసింది.. మరో 18 రోజులు గడిచిపోయాయి… అయినా సంబంధిత యంత్రాంగం ఇంతవరకూ ఎలాంటి వివరాలు తెలియజేయలేదు.. సూత్రదారులు.. పాత్రదారులు ఎవరు… చోరి ఎవరు చేయించారు.. ఎవరు చేశారు.. ప్రత్యక్షంగా ఎవరి ప్రమేయం ఉంది.. పరోక్షంగా ఎంతమంది సహకరించారు.. సేఫ్ లాకర్ లో సొమ్ము ఉన్న సొమ్ము ఎవరు వినియోగించుకున్నారు.. రికార్డుల ప్రకారం ఆ సొమ్ము తరిగి జమచేయించారా లేదా.. ఎవరితో జమ చేయించారు.. ఒక వేళ సొమ్మ తిరిగి రికవరీ చేయలేక పోతే ఎవరి ఖాతాలో పడుతుంది..అనే ప్రశ్నలకు నేటికి సమాధానం లేదు.. గంటల వ్యవధిలో సమస్యలు పరిష్కరించే యంత్రాంగం.. సమర్దవంతులైన అధికారులు .. పటిష్టమైన బందోబందుబస్తు…నీతినిజాయితీలే పరమావధిగా బావించే అధికారులు..ప్రజా నేతలు ఉన్న రాజమండ్రి నగరపాలక సంస్ధలో చోరీ విషయం మాత్రం గుట్టుగానే ఉంది.. చోరి విచారణలో వాస్తవాలు వెల్లడించలేక పోవడం బాధ్యతారాహిత్యమా.. ఇష్టారాజ్యమా అని కార్పోరేషన్ వర్గాలలోనే చర్చనీయాంశంగా మారింది.. నగరపాలక సంస్ధ కార్యాలయంలో చోరీకి సంబందించిన విచారణే నత్త కంటే నిదానంగా విచారణ సాగుతుంటే ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కూడా పారదర్శకత..జవాబుదారి తనం మరింత లోపించేలా ఉందన్న విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి..

కర్టెసీ ggk

Leave a Comment

Your email address will not be published.

Start typing and press Enter to search