కీర్తికి సర్కార్ వారి బర్త్ డే విషెస్

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే అటు తమిళంలోనూ వరుసగా అవకాశాలు అందుకుంటోంది కీర్తి సురేష్. నేడు ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా తాజాగా సర్కార్ వారి పాట బృందం తనకు విషెస్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో కీర్తి లుక్ సింప్లీ సూపర్భ్ అని పొగిడేయాల్సిందే. ప్రతిసారీ సాంప్రదాయబద్ధంగా కనిపించే కీర్తి ఈసారి కూడా ట్రెడిషన్ పరంగా హద్దులు మీరలేదు. అలా క్యాజువల్ డ్రెస్ పై డెనిమ్స్ ధరించి స్మైలీ లుక్ తో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అభిమానుల్లో వైరల్ గా మారింది.

ఇంతకుముందే సర్కార్ వారి పాట నుంచి కీర్తి లుక్ రిలీజ్ కాగా దానికి అద్భుత స్పందన వచ్చింది. కుందనపు బొమ్మకు మరు రూపంలా ఉంది! బాపు బొమ్మ.. బుట్ట బొమ్మకు ఎంత మాత్రం తగ్గదు అంటూ పొగిడేశారు ఫ్యాన్స్. కీర్తికి యువతరం హృదయాల్లో ఎదురే లేని స్థానం దక్కింది. కానీ దానిని స్టార్ డమ్ వైపు మరల్చడంలోనే లక్ కలిసి రాలేదు. నటి మేనక వారసురాలిగా ఘనమైన ఆరంగేట్రాన్ని చాటుకున్న కీర్తి బాలనటిగానూ సుపరిచితం. మహానటి గా కీర్తి నీరాజనాలు అందుకుంది. ఇతర నాయికలతో పోలిస్తే కీర్తి సురేష్ గ్లామర్ హద్దులు మీరదు. పద్ధతిగా సాంప్రదాయ బద్ధమైన గెటప్ తోనే కనిపిస్తోంది.

తాజాగా బర్త్ డే పోస్టర్ ని షేర్ చేసిన సర్కార్ వారి టీమ్ కీర్తికి విషెస్ తెలిపింది. “గొప్ప ప్రతిభావని.. బ్యూటిఫుల్ నటి కీర్తికి వెరీ హ్యాపీ బర్త్ డే..“ అంటూ లవ్ ఈమోజీని జోడించింది. మహేష్.. పరశురామ్ సహా మైత్రి నిర్మాతలు కీర్తికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక కెరీర్ పరంగా చూస్తే.. కీర్తి వరుసగా క్రేజీ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాథే (తెలుగులో పెద్దన్న) లో కీర్తి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `భోళాశంకర్`లో చిరుకి సిస్టర్ పాత్రకు ఎంపికైంది. ఇంతకుముందు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేయగా మెగా ఫ్యాన్స్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవేగాక కీర్తి నటించిన పలు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

తదుపరి తమిళ స్టార్ హీరో విజయ్ సరసన కీర్తి నటించనుంది.  విజయ్- కీర్తిసురేష్ ఇప్పటికే హిట్పెయిర్గా గుర్తింపును తెచ్చుకున్నారు. భైరవ-సర్కార్ చిత్రాల్లో ఈ జోడీ మెప్పించింది. ముచ్చటగా మూడోసారి ఈ జంట ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి పైడిపల్లి వంశీ దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మాత.

Leave a Comment

Your email address will not be published.

Start typing and press Enter to search