అమ్మాయి పుడుతుందని అనుకుంటే నేను పుట్టాను: అఖిల్

అఖిల్ తాజా చిత్రంగా థియేటర్లకు వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాతో అఖిల్ కి హిట్ పడినట్టేననే టాక్ కూడా ఇండస్ట్రీలో బలంగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో  అఖిల్ మాట్లాడుతూ చాలాకాలం క్రితం జరిగిన ఒక సరదా సంఘటనను గురించి ప్రస్తావించాడు. “అమ్మకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాన్న అమెరికాలో టెస్టులు చేయించారు. అమ్మకి టెస్టులు చేసిన అక్కడి డాక్టర్లు కడుపులో ఉన్నది అమ్మాయని చెప్పారట. ఆ మాట వినగానే నాన్న చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

మొదటి నుంచి కూడా నాన్నకి ఆడపిల్లలు అంటే ఇష్టం. అందువలన ఆయన అమ్మాయి పుట్టాలనే కోరుకున్నారు. డాక్టర్లు పుట్టబోయేది అమ్మయేనని తేల్చి చెప్పడంతో ఇక ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే ఆడపిల్లలకి సంబంధించిన డ్రెస్ లు అవీ ఇవీ అన్నీ కొనేశారు. అమ్మాయికి ‘నికిత’ అనే పేరు పెట్టాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. ఇండియాకి రిటర్న్ టిక్కెట్లు బుక్ చేస్తూ అందులో కూడా ‘నికిత’ అనే పేరే రాశారు. కట్ చేస్తే డెలివరీ రూమ్ లో .. పుట్టింది అబ్బాయి అని తెలిసింది. అప్పుడు మా నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యారట.

అలా అమ్మాయి పుడుతుందని నాన్న అనుకుంటే .. నేను పుట్టాను. ఇప్పటికీ అప్పుడప్పుడు నాన్న తన సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పడి పడి నవ్వుతూనే ఉంటారు. నాకు కూడా చాలా తమాషాగా అనిపిస్తూ ఉంటుంది” అని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక  ఇప్పుడు ‘బ్యాచ్ లర్’కి వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న అఖిల్ ఆ తరువాత సినిమాగా ‘ఏజెంట్’ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఇంతవరకూ తాను చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని అఖిల్ చెప్పాడు. ఈ సినిమా కోసం బాడీ బిల్డప్ చేయడానికి చాలా కష్టపడ్డానని అన్నాడు. ఏడాదిన్నరపాటు కసరత్తు చేయవలసి వచ్చిందని చెప్పాడు. ఆరంభంలో కాస్త కష్టంగా అనిప్పించినప్పటికీ ఆ తరువాత అలవాటైపోయిందని అన్నాడు. ఇప్పడు ఇలాగే బావుందనిపిస్తోందనే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. సురేందర్ రెడ్డి టేకింగ్ చాలా స్టైలీష్ గా ఉంటుంది. తెరపై ఆయన హీరోను చూపించే తీరు కొత్తగా ఉంటుంది. అందువలన ఈ సినిమాతో మరో హిట్ అఖిల్ ఖాతాలో చేరిపోవడం ఖాయమనేది అభిమానుల మాట.    

Leave a Comment

Your email address will not be published.

Start typing and press Enter to search